• facebook
  • whatsapp
  • telegram

ఐక్యరాజ్యసమితి - అనుబంధ సంస్థలు

1. యునిసెఫ్‌ (UNICEF) అంటే...

1) యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఎమర్జెన్సీ ఫండ్‌

2) యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఎడ్యుకేషనల్‌ ఫండ్‌

3) యునైటెడ్‌ నేషన్స్‌ ఇన్నోవేటివ్‌ చిల్డ్రన్‌ ఎసెన్షియల్‌ ఫండ్‌

4) యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటరాక్టివ్‌ చిల్డ్రన్‌ ఎంకరేజ్‌ ఫండ్‌


2. యునిసెఫ్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) బాలల సమగ్రాభివృద్ధి సాధనకు కృషి చేస్తుంది.

బి) ఎదుగుతున్న పౌరసమాజంలో బాలలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంది.

సి) దీన్ని 1946లో ‘న్యూయార్క్‌’లో స్థాపించారు.

డి) 1965లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి    3) ఎ, బి, సి    4) పైవన్నీ


3. యునెస్కో (UNESCO) అంటే...

1) యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌

2) యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌

3) యునైటెడ్‌ నేషన్స్‌ ఎంపవర్‌ అండ్‌ సైంటిఫిక్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌

4) యునైటెడ్‌ నేషన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సైంటిఫిక్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌


4. యునెస్కోను ఎప్పుడు స్థాపించారు?

1) 1945, నవంబరు 4      2) 1946, నవంబరు 4

3) 1947, నవంబరు 4     4) 1948, నవంబరు 4


5. యునెస్కోకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) ఇందులో ‘జనరల్‌ కాన్ఫరెన్స్‌’, ‘ఎగ్జిక్యూటివ్‌ బోర్డులు’ ముఖ్యమైనవి.

బి) యూఎన్‌ఓ సభ్యదేశాలన్నీ ‘జనరల్‌ కాన్ఫరెన్స్‌’లో సభ్యదేశాలుగా కొనసాగుతాయి.

సి) ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో 58 దేశాలకు సభ్యత్వం ఉంటుంది.

డి) ఎగ్జిక్యూటివ్‌ బోర్డులోని సభ్యదేశాల పదవీకాలం నాలుగేళ్లు.

1) ఎ, బి, మాత్రమే     2) సి, డి మాత్రమే

3) ఎ, సి మాత్రమే    4) పైవన్నీ


6. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారం కోసం యునెస్కో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. వాటికి సంబంధించి కింది వాటిలో సరికానిదేది?

1) కైరో, జకార్తా  2) నైరోబీ, వెనిస్   3) రోమ్‌  4) న్యూదిల్లీ


7. యునెస్కో లక్ష్యాలకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) అందరికీ ప్రాథమిక విద్య అందించడం

బి) ప్రాథమిక విద్య ప్రమాణాలను పెంపొందించడం

సి) ప్రాథమిక విద్యావ్యాప్తి కోసం చేసే సహాయాన్ని విస్తరించడం

డి) 21వ శతాబ్దానికి సార్వజనీన విద్య సాధించడం

1)  ఎ, బి   2) బి, డి     3) బి, సి   4) పైవన్నీ


8. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1)టోక్యో (జపాన్‌)    2)పారిస్‌ (ఫ్రాన్స్‌)

3) సిడ్నీ (ఆస్ట్రేలియా)     4) మాస్కో (రష్యా)


9. UNIDO అంటే.....

1) యునైటెడ్‌ నేషన్స్‌ ఇండస్ట్రియల్‌  డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌

2) యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌

3) యునైటెడ్‌ నేషన్స్‌ ఇన్నోవేషన్‌  డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌

4) యునైటెడ్‌ నేషన్స్‌ ఇన్ఫర్మేషన్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌


10. కింది వాటిలో యూఎన్‌ఐడీఓకు సంబంధించి  సరైంది?

ఎ) 1967, జనవరి నుంచి తన పనిని ప్రారంభించింది.

బి) యూఎన్‌ఓ ప్రత్యేక అనుబంధ సంస్థగా 1985లో గుర్తింపు పొందింది.

సి) దీని ప్రధాన కార్యాలయం ‘వియన్నా’ (ఆస్ట్రియా)లో ఉంది.

డి) ప్రాంతీయ కార్యాలయాలు కొలంబో, ఇస్తాంబుల్, న్యూయార్క్‌లో ఉన్నాయి.

1) ఎ, సి మాత్రమే      2) బి, డి మాత్రమే    3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ


11. యూఎన్‌ఐడీఓలో అంతర్భాగమైన ప్రోగ్రామ్‌ అండ్‌ బడ్జెట్‌ కమిటీలో రెండేళ్ల పదవీ కాలానికి ఎన్ని సభ్యదేశాలు ఎన్నికవుతాయి?

1) 16   2) 27    3) 33   4) 49


12. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ - (ఆహార వ్యవసాయ సంస్థ)కు సంబంధించి సరైంది?

ఎ) 1946, డిసెంబరు 14న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది.

బి) ఎఫ్‌ఎఓ కౌన్సిల్‌లో 49 సభ్యదేశాలు ఉంటాయి.

సి) దీని ప్రధాన కార్యాలయం ‘రోమ్‌’ (ఇటలీ)లో ఉంది.

డి) వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల దిగుబడులు, పంపిణీ రంగాలు అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.

1) ఎ, బి,   2)  బి, డి     3) ఎ, సి, డి   4) పైవన్నీ


13. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization - WHO) కు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) 1947, నవంబరు 15న ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది.

బి) మశూచి (స్మాల్‌పాక్స్‌) నిర్మూలనలో కీలకపాత్ర వహించింది.

సి) అన్ని వర్గాల ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం.

డి) దీని ప్రధాన కార్యాలయం ‘జెనీవా’ (స్విట్జర్లాండ్‌)లో ఉంది.

1) ఎ, బి   2) బి, సి    3) ఎ, డి   4) పైవన్నీ


14. కింది వాటిలో సరికాని జత ఏది?

1) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - ఏప్రిల్‌ 7

2) పొగాకు వ్యతిరేక దినోత్సవం - మే 31

3)ఎయిడ్స్‌ వ్యతిరేక దినోత్సవం-డిసెంబరు 1

4) విద్యా దినోత్సవం - జనవరి 13


15. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?

ఎ) యూరప్‌ - కోపెన్‌హెగన్‌ (డెన్మార్క్‌)

బి) ఆగ్నేయాసియా - న్యూదిల్లీ  (ఇండియా)

సి) ఆఫ్రికా - నైరోబీ (కెన్యా)

డి) ఈశాన్య మధ్యధరా ప్రాంతాలు - అలెగ్జాండ్రియా (ఈజిప్ట్‌)

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి   3) ఎ, సి     4) పైవన్నీ


16. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ -ILO)కు సంబంధించి కింది వాటిలో సరైంది? 

ఎ) 1919, ఏప్రిల్‌ 11న ‘నానాజాతి సమితి’కి అనుబంధంగా స్వయంప్రతిపత్తి గల సంస్థగా స్థాపించారు.

బి) 1946లో ఐక్యరాజ్యసమితికి ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది.

సి) కార్మికుల సంక్షేమం కోసం అభిలషణీయమైన చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తుంది.

డి) 1976లో దీన్ని రద్దు చేశారు.

1) ఎ, బి   2) సి, డి    3) ఎ, బి, సి    4) పైవన్నీ


సమాధానాలు

1-1  2-4   3-2  4-2   5-4  6-3   7-4    8-2    9-1  10-3  11-2  12-4  13-4  14-4  15-4  16-3  


మరికొన్ని..

1. కింది వాటిలో అంతర్జాతీయ కార్మిక సంస్థకు సంబంధించి సరైంది?

ఎ) శాశ్వత సభ్యదేశాల సంఖ్య - 10

బి) 1969లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.

సి) 1971లో టెంపుల్టన్‌ బహుమతి పొందింది.

డి) దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి   3)ఎ, బి, డి    4) పైవన్నీ


2. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1)  టోక్యో (జపాన్‌)   2) లండన్‌ (ఇంగ్లండ్‌)   3) కాబూల్‌ (ఆఫ్గానిస్థాన్‌)     4) కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా)


3.UNEP అంటే...

1) యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్‌

2) యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

3) యునైటెడ్‌ నేషన్స్‌ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌

4) యునైటెడ్‌ నేషన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌


4. 1972లో పర్యావరణంపై ఎక్కడ జరిగిన సమావేశం ఫలితంగా ‘యూఎన్‌ఈపీ’ ఏర్పడింది?

1)స్టాక్‌హోమ్‌ (స్వీడన్‌)     2) బీజింగ్‌ (చైనా) 

3)బర్మింగ్‌హామ్‌ (ఇంగ్లండ్‌)   4) శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)


5. యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) న్యూయార్క్‌ (అమెరికా)    2) నైరోబీ (కెన్యా)   3) ప్రిటోరియా (దక్షిణాఫ్రికా)   4) నాగసాకి (జపాన్‌)


6. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించడానికి ఒక అంతర్జాతీయ సంస్థ అవసరమని 1953లో యూఎన్‌ఓ సాధారణ సభలో ప్రతిపాదించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు ఎవరు?

1) జాన్‌ ఎఫ్‌.కెన్నడీ   2) ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌    3) డ్వైట్‌ ఐసన్‌హోవర్‌     4) అబ్రహం లింకన్‌


7. అణ్వస్త్ర విస్తరణ నిరోధక ఒప్పందం (NPT) ఎప్పటి నుంచి అమల్లోకి  వచ్చింది?

1) 1966, మార్చి   2) 1970, మార్చి   3) 1973, మార్చి   4) 1981, మార్చి


8. CTBT అంటే ఏమిటి?

1) కాంప్రహెన్సివ్‌ టెస్ట్‌ బ్యాన్‌ ట్రీటీ     2) కమ్యూనికేటివ్‌ టెస్ట్‌ బ్యాన్‌ ట్రీటీ

3) కామన్‌ ట్రీటీ బర్న్‌ టార్గెట్‌   4)క్యుములేటివ్‌ టెస్ట్‌ బ్యాన్‌ టార్గెట్‌


సమాధానాలు

1-3   2-1   3-2    4-1    5-2    6-3   7-2   8-1    

Posted Date : 15-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌