• facebook
  • whatsapp
  • telegram

శాతాలు

ముఖ్యాంశాలు

మాదిరి ప్రశ్నలు

1. ఒక పుస్తకంలో 900 పేజీలు ఉన్నాయి. సాయితేజ అనే విద్యార్థి రోజుకు 10 పేజీల చొప్పున 10 రోజుల పాటు ఆ పుస్తకాన్ని చదివాడు. అయితే ఆ విద్యార్థి 10 రోజుల్లో పుస్తకం చదివిన శాతం ఎంత?
1) 10%           2) 11.11%             3) 15%            4) 25%
సాధన: పుస్తకంలోని పేజీలు = 900
            రోజుకు చదివిన పేజీలు = 10
            పుస్తకం చదివిన రోజులు = 10
            10 రోజుల్లో చదివిన పేజీలు = 10   10 = 100


                 

2. ఒక సంఖ్యలో 39% విలువ మరొక సంఖ్యలోని 52% కి సమానమైతే, ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత?
1) 2 : 3            2) 3 : 4             3) 4 : 5               4) 4 : 3
సాధన: ఒక సంఖ్య = x, మరొక సంఖ్య = y అనుకుందాం.
లెక్క ప్రకారం, x లో 39% = y లో 52%.

జవాబు: 4
సులభ మార్గం: రెండు సంఖ్యల నిష్పత్తి
                       = 52 : 39 = 4 : 3

 

3. ఒక పాఠశాలలోని బాలుర సంఖ్య, ఆ పాఠశాలలోని బాలికల సంఖ్యకు 15% ఎక్కువ. అయితే ఆ పాఠశాలలోని బాలురు, బాలికల నిష్పత్తి ఎంత?
1) 13 : 7             2) 7 : 13             3) 23 : 20             4) 20 : 23
సాధన: పాఠశాలలో బాలికల సంఖ్య = 100 అనుకుందాం

బాలురు = 100 + 100 లో 15%

= 100 + 15 = 115
బాలురు : బాలికలు = 115 : 100
                              = 23 : 20

జవాబు: 3
[Note: a కి చెందిన x% విలువ - x కి చెందిన b% విలువ = (a - b) కి చెందిన x% విలువ]
[(x% of a - b% of x = x% of (a - b)]

 

4. 7.9% of 134 - 34% of 7.9 = .......... ?
1) 8.1                    2) 7.9                      3) 7.3                    4) 7.6
సాధన: 7.9% of 134 - 34% of 7.9
                         = 7.9% of 134 - 34 of 7.9%
                         = 7.9% of (134 - 34)
                         = 7.9% of 100
                         = 7.9                                                                                                              

5. ఒక సంఖ్యలో 75% విలువకు 75 కూడితే అదే సంఖ్య వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏది?
1) 100                2) 150              3) 225              4) 300
సాధన: ఆ సంఖ్య = x అనుకుందాం

జవాబు: 4
 

6. ఒక పరీక్షలో విద్యార్థికి 40% మార్కులు వస్తే అతడు ఉత్తీర్ణత సాధిస్తాడు. ఆ పరీక్షలో ఒక విద్యార్థికి 40 మార్కులు లభించి, 40 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ పరీక్షలో గరిష్ఠ మార్కులు ఎన్ని?
1) 200                   2) 300              3) 400                     4) 100
సాధన: పరీక్షలో గరిష్ఠ మార్కులు = x అనుకుందాం.
విద్యార్థి ఉత్తీర్ణతకు రావాల్సిన మార్కులు = 40 + 40
                = 80
x లో 40% = 80

జవాబు: 1


లాభశాతం - నష్టశాతం

కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది.
లాభం = అమ్మిన వెల - కొన్న వెల

 కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువగా ఉంటే నష్టం వస్తుంది.
నష్టం = కొన్న వెల - అమ్మిన వెల

Note: లాభశాతాన్ని లేదా నష్టశాతాన్ని కొన్న వెలపై లెక్కిస్తారు.


 

ప్ర: ఒక వ్యాపారి ఒక వస్తువును రూ.100 కు అమ్మడం ద్వారా రూ.10 లాభం వచ్చింది. అయితే లాభశాతం ఎంత?

సాధన: ఒక వస్తువు అమ్మిన వెల = రూ.100
                            లాభం = రూ.10

కొన్న వెల = అమ్మిన - వెల లాభం
                = 100 - 10 = రూ.90


జవాబు: 2
నోట్: ఒక వస్తువు కొన్న వెల; లాభశాతం ఇస్తే అమ్మిన వెల కనుక్కోవడానికి ఈ కింది సూత్రాన్ని ఉపయోగిస్తారు.

జవాబు: 3

ప్ర: ఒక వ్యాపారి ఒక వస్తువును రూ.150 కి అమ్మడం ద్వారా 10% నష్టం వస్తుంది. ఆ వ్యాపారి అదే వస్తువును 20% లాభం పొందాలంటే ఎంతకు అమ్మాలి?
1) రూ.200              2) రూ.250             3) రూ.180           4) రూ.240
సాధన: వస్తువు కొన్న వెల = 100% అనుకుందాం
(100% - 10%) = 90% ------------ రూ.150
(100% + 20%) = 120% ------------- ?

జవాబు: 1

మాదిరి సమస్యలు

2.  ఒక సంఖ్యలో 75 శాతానికి 75 కలిపితే అదే సంఖ్య వస్తుంది. అయితే ఆ సంఖ్యలో 40% విలువ ఎంత?
    1) 80        2) 120        3) 150        4) 160
సాధన: ఆ సంఖ్య x అనుకోండి.
x లో 75% + 75 = x

5. A అనే సంఖ్యలో 30%, B అనే సంఖ్యలో 40% ల మొత్తం B లో 80 శాతానికి సమానమైతే A లో B ఎంత శాతం?
    1) 30%       2) 40%       3) 70%       4) 75%

6.  A లో 90% = B లో 30%, A లో x% = B అయితే x = ....

1) 800           2) 300          3) 700           4) 400

7. ఒక గ్రామ జనాభాలో స్త్రీల సంఖ్య పురుషుల జనాభాలో 90%. ఆ గ్రామంలో పురుషుల జనాభా, స్త్రీల జనాభాలో ఎంత శాతం?

9. A జీతం, B జీతంలో 40 శాతానికి సమానం. B జీతం, C జీతంలో 25% శాతానికి సమానం. B జీతం, C జీతంలో ఎంత శాతానికి సమానం?
1) 5%        2) 20%       3) 10%       3) 25%   
సాధన: C జీతం = x  అనుకోండి.
B జీతం = C జీతంలో 25%

10. క్రికెట్‌ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మన్‌ 110 పరుగులు చేశాడు. ఆ పరుగుల్లో 3 బౌండరీలు, 8 సిక్స్‌లు ఉన్నాయి. అతడు వికెట్ల మధ్య పరిగెత్తడం ద్వారా లభించిన పరుగులు అతడి మొత్తం పరుగుల్లో ఎంత శాతానికి సమానం?

సాధన: బ్యాట్స్‌మన్‌ చేసిన మొత్తం పరుగులు = 110 పరుగులు
బౌండరీలు, సిక్సర్ల ద్వారా లభించిన పరుగులు = 3 x 4 x 8 x 6
                                                                   = 12 + 48  = 60 పరుగులు        
వికెట్ల మధ్య పరిగెత్తడం ద్వారా బ్యాట్స్‌మన్‌కి లభించిన పరుగులు = 110  60 = 50 పరుగులు
వికెట్ల మధ్య పరుగెత్తడం ద్వారా లభించిన పరుగుల శాతం

Posted Date : 15-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు