• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CLAT: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)-2025 

నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో ఏటా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తున్నాయి. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాంలు (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) అందిస్తున్నాయి. ప్రస్తుతం యూజీ క్లాట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశవ్యాప్తంగా 24 ప్రధాన లా యూనివర్సిటీలు ఇందులో పాల్గొంటున్నాయి. అర్హులైన వారు అక్టోబర్‌ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పాల్గొనే విశ్వవిద్యాలయాలు:

ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్‌ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్‌ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్‌ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో (ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్‌ ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ (ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్‌), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్‌), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హరియాణా), ఎన్‌ఎల్‌యూటీ (అగర్తలా), జీఎన్‌ఎల్‌యూ (సిల్వస్సా).

కోర్సులు…

1. అండర్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)

2. పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ)

అర్హతలు: యూజీ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమాన పరీక్ష. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.4,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీపీఎల్‌ అభ్యర్థులకు రూ.3,500

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 15-07-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15-10-2024.

క్లాట్‌-2025 పరీక్ష (ఆఫ్‌లైన్‌) తేది: 01-12-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 07-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :