• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIFPT: ఐఐఎఫ్‌పీటీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు

భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన తమిళనాడు (తంజావూరు)లోని నిఫ్టెమ్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ) 2021- 2022 విద్యాసంవత్సరానికి వివిధ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

1) బీటెక్‌ ప్రోగ్రాం (ఫుడ్‌ టెక్నాలజీ)

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.

అర్హత: ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్‌)-2021 అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా జేఈఈ (మెయిన్‌) 2021 ర్యాంకు (జోసా 2021) ఆధారంగా ఎంపిక చేస్తారు.

2) ఎంటెక్‌ ప్రోగ్రాం (ఫుడ్‌ టెక్నాలజీ)

విభాగాలు: ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ టెక్నాలజీ, ఫుడ్ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ అజ్యూరెన్స్‌.

కోర్సు వ్యవధి: రెండు సంవత్సరాలు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: యూజీ మార్కులు, నిఫ్టెమ్‌-టీ-ఐఐఎఫ్‌పీటీ ఆన్‌లైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

3) పీహెచ్‌డీ ప్రోగ్రాం (ఫుడ్‌ టెక్నాలజీ)

విభాగాలు: ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ టెక్నాలజీ.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 

ఎంపిక విధానం: యూజీ, పీజీ మార్కులు, నిఫ్టెమ్‌-టీ-ఐఐఎఫ్‌పీటీ ఆన్‌లైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంటెక్‌ ప్రోగ్రాములకి చివరి తేది: 25.10.2021.

పీహెచ్‌డీ ప్రోగ్రాములకి చివరి తేది: 15.12.2021.

నోటిఫికేషన్: http://iifpt.edu.in/ug.php

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ వివిధ లోహాలు... అవి లభించే ముడి పదార్థాలు

‣ ముంగిట్లో ముష్కరుల ముప్పు

‣ మానవుల్లో శిలీంద్రాల వల్ల వచ్చే వ్యాధులు

‣ On the spot, In a jiffy 

‣ యూసీఐఎల్‌, ఝార్ఖండ్‌లో 242 అప్రెంటిస్‌లు

 

Notification Information

Posted Date: 22-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :