• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జామ్‌ - 2022

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) ప్రాంగణాల్లో ఎమ్మెస్సీ, ఇతర డ్యుయల్‌ డిగ్రీ, పోస్టు బ్యాచిలర్స్‌ డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే జాయింట్ అడ్మిష‌న్ టెస్ట్ ఫ‌ర్ మాస్ట‌ర్స్‌(జామ్‌)-2022 నోటిఫికేష‌న్ వెలువ‌డింది. దీనిని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ(ఐఐటీ రూర్కీ), ఉత్తరాఖండ్‌ నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు..

జాయింట్ అడ్మిష‌న్ టెస్ట్ ఫ‌ర్ మాస్ట‌ర్స్‌(జామ్‌)-2022

అర్హ‌త‌: కనీసం 55 శాతం మార్కులతో స‌ంబంధిత క్వాలిఫైయింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణ‌త.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: దీనిలో మొత్తం 7 టెస్ట్‌ పేపర్లు ఉంటాయి. అవి బయెటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, జియాలజీ, మ్యాథమేటిక్స్‌, మ్యాథమేటికల్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్. జామ్‌ 2022 ప్రశ్నపత్రం మొత్తం ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. ఈ ప్రశ్నలని మూడు రకాలుగా విభజించి ప్రశ్నపత్రంలో పొందుపరుస్తారు. అవి 1) మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు  2) మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు  3) న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ పశ్నలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదారాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఒక టెస్ట్‌ పేపర్‌కి రూ.750, రెండు టెస్ట్‌ పేపర్లకి రూ.1050 చెల్లించాలి. ఇతరులు ఒక టెస్ట్‌ పేపర్‌కి రూ.1500, రెండు టెస్ట్‌ పేపర్లకి రూ.2100 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 30.08.2021.

ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులకి చివ‌రి తేది: 11.10.2021.

జామ్‌ 2022 ప‌రీక్ష తేది: 13.02.2022.

ఫలితాలు వెల్లడించే తేది: 22.03.2022.

Notification Information

Posted Date: 30-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :