• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JNTUH: జేఎన్‌టీయూహెచ్‌లో ఐదేళ్ల ఐడీడీఎం ప్రోగ్రాం

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ), స్వీడన్‌(యూరప్‌)లోని బ్లెకింగె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బీటీహెచ్‌)తో కలిసి 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ ప్రోగ్రాం (ఐడీడీఎంపీ)

అందిస్తున్న కోర్సులు: 

1) ఐడీడీఎంపీ (ఈసీఈ) - 20 సీట్లు

బీటెక్‌ (ఈసీఈ) అండ్‌ ఎంటెక్‌ (టెలీకమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌) జేఎన్‌టీయూహెచ్‌లో, ఎమ్మెస్సీ (టెలీకమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌) బీటీహెచ్‌, స్వీడన్‌లో అందిస్తారు.

2) ఐడీడీఎంపీ (సీఎస్‌ఈ) - 40 సీట్లు

* బీటెక్‌ (సీఎస్‌ఈ) & ఎంటెక్‌ (సీఎస్‌ఈ) జేఎన్‌టీయూహెచ్‌లో, ఎమ్మెస్సీ (సీఎస్‌ఈ) బీటీహెచ్‌, స్వీడన్‌లో అందిస్తారు (20 సీట్లు).

* బీటెక్‌ (సీఎస్‌ఈ) & ఎంటెక్‌ (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌) జేఎన్‌టీయూహెచ్‌లో, ఎమ్మెస్సీ (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్) బీటీహెచ్‌, స్వీడన్‌లో అందిస్తారు (20 సీట్లు).

3) ఐడీడీఎంపీ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌) - 15 సీట్లు

బీటెక్‌ (మెకానికల్‌) అండ్‌ ఎంటెక్‌ (మెకానికల్‌) జేఎన్‌టీయూహెచ్‌లో, ఎమ్మెస్సీ (మెకానికల్‌) బీటీహెచ్‌, స్వీడన్‌లో అందిస్తారు.

అర్హత: కనీసం 70 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. 

వయసు: అభ్యర్థులకి 16 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: టీఎస్‌ ఎంసెట్‌/ జేఈఈ (మెయిన్స్‌)-2021 ర్యాంకు ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.2000 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 30.10.2021.

రూ.1000 ఆలస్య రుసుంతో చివరి తేది: 05.11.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఇంధన వాయువులు - ఉపయోగాలు

‣ ప‌ర్యాట‌కంలో మేనేజ్‌మెంట్ ప‌ట్టాలు

‣ పది చాలు.. వేల ఉద్యోగాలు!

‣ దిల్లీ పోస్టల్‌ సర్కిల్‌లో 221 పోస్టులు

‣ సీయూజీలో నాన్ టీచింగ్ పోస్టులు 

Notification Information

Posted Date: 13-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :