• facebook
  • twitter
  • whatsapp
  • telegram

KNRUHS: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులు

2022-2023 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. 

కోర్సు వివరాలు:

1. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ): నాలుగేళ్ల కోర్సు

2. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్): నాలుగేళ్ల కోర్సు

3. పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్): రెండేళ్ల కోర్సు

అర్హత: కోర్సును అనుసరించి ఇంటర్మీడియట్(బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు, జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31-12-2022 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.2,500 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000).

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-10-2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేముందు!

‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!

‣ నీట్‌ కటాఫ్‌ ఎంత?

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

Notification Information

Posted Date: 27-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :