ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) సంస్థ ఫుట్‌వేర్, ఫ్యాషన్, రిటైల్, లెదర్ యాక్సెసరీలు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు సంబంధించి అర్హులకు శిక్షణ ఇచ్చి, నాణ్యమైన మానవ వనరులను పరిశ్రమలకు అందిస్తోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 కేంద్రాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో 2023-24 సంవత్సరానికి గాను కింది ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
దేశవ్యాప్తంగా 12 కేంద్రాలు: హైదరాబాద్, నోయిడా, రోహ్‌తక్, కోల్‌కతా, ఫుర్సత్‌గంజ్, చెన్నై, జోధ్పూర్, చిండ్వారా, పట్నా, చండీగఢ్, గుణ, అంక్లేశ్వర్.
వివరాలు...
* మొత్తం సీట్లు: 2300
* ఎన్‌ఆర్‌ఐ, ఇండస్ట్రీ స్పాన్సర్డ్ సీట్లు: 230
సంస్థ అందిస్తున్న కోర్సులు:
1. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్
విభాగాలు: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, లెదర్, లైఫ్‌స్టైల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్.
అర్హత: 10+2/ డిప్లొమా ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: ఈ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.
2. బీబీఏ: రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్
కోర్సు వ్యవధి: మూడేళ్లు.
అర్హత: 10+2/ డిప్లొమా ఉత్తీర్ణత.
* బ్యాచిలర్ డిగ్రీ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 25 ఏళ్లు మించకూడదు.
3. పీజీ మాస్టర్ ఆఫ్ డిజైన్: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్.
అర్హత: ఫుట్‌వేర్ / లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్ / డిజైన్ / ఇంజినీరింగ్ / ప్రొడక్షన్/ టెక్నాలజీల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: రెండేళ్ల వ్యవధితో దీన్ని అందిస్తున్నారు.
4. ఎంబీఏ (రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు.
ఎంపిక విధానం: ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్(ఏఐఎస్‌టీ) 2023 పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం:
* యూజీ కోర్సులకు 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 4 సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. మొదటి సెక్షన్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలు అడుగుతారు. రెండో సెక్షన్‌లో కాంప్రహెన్షన్ నుంచి 10, గ్రామర్ యూసేజ్...తదితరాల నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మూడో సెక్షన్ జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 35 ప్రశ్నలు వస్తాయి. నాలుగో సెక్షన్‌లో బిజినెస్ ఆప్టిట్యూడ్ నుంచి 25, డిజైన్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. మొదటి మూడు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. చివరి సెక్షన్‌లో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు.
* పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో 4 సెక్షన్ల నుంచి 175 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ ఎనలిటికల్ ఎబిలిటీ 50 మార్కులకు 50 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరంట్ అఫైర్స్ 50 ప్రశ్నలు 50 మార్కులు, మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్టు, ఎనలిటికల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.600.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు చివరి తేది: 30.04.2023
అడ్మిట్ కార్డులు: 05.06.2023
ఏఐఎస్‌టీ 2023 పరీక్ష: 18.06.2023
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రూప్-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?
‣ ఆన్‌లైన్‌లో చదివే విధానం ఏమిటంటే?
‣ 50,000 మందికి స్కాలర్‌షిప్‌లు!
AITP: ఏఐటీ, పుణెలో ఎంఈ డేటా సైన్స్ ప్రోగ్రాం
TTWREIS: అశోక్‌నగర్ సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశాలు
IIITP: ట్రిపుల్ ఐటీ పుణెలో పీహెచ్డీ ప్రోగ్రాం
IIITP: ట్రిపుల్ ఐటీ పుణెలో ఎంటెక్ ప్రోగ్రాం
AP EdCET: ఏపీ ఎడ్‌సెట్-2023
NIBM: ఎన్ఐబీఎం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
TMI: తొలాని మారిటైమ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా కోర్సు
CUETPG: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) 2023
AP PECET: ఏపీ పీఈసెట్-2023
AP LAWCET: ఏపీ లాసెట్-2023
EJS: ఈనాడు జర్నలిజం స్కూలులో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు
KVS Admissions 2023: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు
AP PGECET: ఏపీ పీజీఈసెట్-2023
BIT: బిట్ మెస్రాలో పీహెచ్డీ ప్రోగ్రాం
BIT: బిట్ మెస్రాలో పీజీ ప్రోగ్రాం
BIT: బిట్ మెస్రాలో ఎంసీఏ ప్రోగ్రాం
BIT: బిట్ మెస్రాలో ఎంబీఏ ప్రోగ్రాం
BITS: బిట్ మెస్రాలో బీహెచ్ఎంసీటీ ప్రోగ్రాం
AS ICET: ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023
IISc: బెంగళూరు ఐఐఎస్సీలో బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రాం