• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NVS: ఎన్‌వీఎస్‌ - జేఎన్‌వీల్లో ఆరో తరగతి ప్రవేశాలు

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌వీ) 2022 - 2023 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఎన్‌వీఎస్‌ - జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు

అర్హత: 2021-2022 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయసు: 01.05.2009 - 30.04.2013 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: సెలక్షన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారు. మొత్తం 3 సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: 

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.09.2021

* ఆన్‌లైన్ దరఖాస్తులకి చివరి తేది: 30.11.2021.

* పరీక్ష తేది: 30 ఏప్రిల్‌, 2022.

Notification Information

Posted Date: 23-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :