తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (టీఎస్‌ఐసెట్) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2023 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 6 నుంచి మే 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు మే 26, 27 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష వివరాలు:
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(టీఎస్ ఐసెట్)
కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)/ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ)
అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జె్క్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.550).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు: మార్చి 6న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై, మే 6తో ముగుస్తుంది. రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
తప్పుల సవరణ: మే 12 నుంచి 18 వరకు దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: మే 22 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష కేంద్రాలు: 75 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయి.
పరీక్షల నిర్వహణ: మే 26, 27 తేదీల్లో ప్రవేశపరీక్షలు జరుగుతాయి.
కీ, ఫలితాల ప్రకటన: జూన్ 5న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించి జూన్ 20న ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల చేస్తారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రీయ సంస్థల్లో యూజీ.. పీజీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
AP PGCET: ఏపీ పీజీసెట్ 2023
NGSU: నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం
MANIT: మానిట్, భోపాల్‌లో ఎంఏ ప్రోగ్రాం
MANIT: మానిట్, భోపాల్‌లో పీహెచ్డీ ప్రోగ్రాం
IGIDR: ఐజీఐడీఆర్, ముంబయిలో పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాం
AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు
TSEMR Schools: తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
IIGM: ఐఐజీఎం, నవీ ముంబయిలో జేఆర్ఎఫ్ ప్రోగ్రాం
AITP: ఏఐటీ, పుణెలో ఎంఈ డేటా సైన్స్ ప్రోగ్రాం
TTWREIS: అశోక్‌నగర్ సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశాలు
IIITP: ట్రిపుల్ ఐటీ పుణెలో పీహెచ్డీ ప్రోగ్రాం
IIITP: ట్రిపుల్ ఐటీ పుణెలో ఎంటెక్ ప్రోగ్రాం
AP EdCET: ఏపీ ఎడ్‌సెట్-2023
NIBM: ఎన్ఐబీఎం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
TMI: తొలాని మారిటైమ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా కోర్సు
CUETPG: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) 2023
AP PECET: ఏపీ పీఈసెట్-2023
AP LAWCET: ఏపీ లాసెట్-2023
EJS: ఈనాడు జర్నలిజం స్కూలులో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు
KVS Admissions 2023: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు