• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TSPSC-RIMC: టీఎస్‌పీఎస్సీ-ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వశాఖ‌కు చెందిన దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జులై 2023 ట‌ర్మ్‌ ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు తెలంగాణ‌కు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు

అర్హ‌త‌: ఏడో త‌ర‌గ‌తి చదువుతున్న లేదా ఎడో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. 

వ‌య‌సు: 01.07.2023 నాటికి ప‌ద‌కొండున్న‌ర ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా ప‌ద‌మూడేళ్ల‌కు మించ‌కుండా ఉండాలి. 02.07.2010-01.001.2012 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, వైవా వాయిస్‌, మెడిక‌ల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ప‌రీక్షా విధానం: రాత ప‌రీక్ష‌లో మొత్తం మూడు పేప‌ర్లు ఉంటాయి. అవి మ్యాథ‌మేటిక్స్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు వైవా వాయిస్ నిర్వ‌హిస్తారు. దీనిలో క‌నీస ఉత్తీర్ణ‌త మార్కులు 50% ఉండాలి‌. ఈ రెండింటిలో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు చివ‌రిగా మెడిక‌ల్ టెస్ట్ ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థులు రూ.555 చెల్లించాలి.

దరఖాస్తులను పంపడానికి చిరునామా: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ), నాంపల్లి,  హైదరాబాద్‌, తెలంగాణ-500001.

ముఖ్య‌మైన తేదీలు:

* ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.10.2022.

* ప‌రీక్ష తేది: 03.12.2022.
 

Some More Notifications

IUST, Awantipora - UG, Lateral Entry Programmes

NBE - NEET Super Specialty 2022

NPTI - PG Diploma Courses

IISC, Bangalore - B.Tech Program

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Notification Information

Posted Date: 21-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :