• facebook
  • twitter
  • whatsapp
  • telegram

INCOIS: ఇన్‌కాయిస్‌లో 82 ప్రాజెక్ట్‌ సైంటిస్టులు

భారత ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 82

పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ సైంటిస్టులు (1, 2, 3) - 62, ప్రాజెక్ట్ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (1, 2) - 20.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.39000 నుంచి రూ.78000 + హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌(1, 2, 3) పోస్టులకి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ప్రాజెక్ట్ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (1, 2) పోస్టులకి రాత పరీక్ష ఆధారంగా మాత్రమే ఎంపిక నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 22.09.2021.

Notification Information

Posted Date: 23-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :