• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APEPDCL: ఏపీఈపీడీసీఎల్‌లో 398 జూనియ‌ర్ లైన్‌మెన్లు

విశాఖపట్నంలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (ఏపీఈపీడీసీఎల్‌) గ్రామ/ వార్డ్‌ సెక్రటేరియట్స్ కింద వివిధ జిల్లాల్లో పని చేయడానికి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌ 2)

మొత్తం ఖాళీలు: 398

అర్హత: ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌/ వైర్‌మెన్‌ ట్రేడ్‌లో ఐటీఐ/  సంబంధిత సబ్జెక్టుల్లో రెండేళ్ల ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:  రాత పరీక్ష, పోల్‌ క్లైంబింగ్, మీటర్‌ రీడింగ్‌, సైక్లింగ్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఐటీఐ సిలబస్‌ ఆధారంగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకి గాను 80 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి పోల్‌ క్లైంబింగ్‌, మీటర్‌ రీడింగ్, సైక్లింగ్‌ టెస్టులు నిర్వహిస్తారు. పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. దీనికి 15 నిమిషాల సమయం ఉంటుంది. ఈ మూడింట్లో దేనిలో అర్హత సాధించకపోయినా ఎంపిక ప్రక్రియ నుంచి పూర్తిగా వైదొలుగుతారు. దీనికి ఇంటర్వ్యూ లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.700, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.350 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.08.2021.

దరఖాస్తులకి చివరి తేది: 24.09.2021.

Notification Information

Posted Date: 31-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :