• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NAVY: డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌లో 173 ఖాళీలు 

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కర్ణాటకలోని నావల్‌ షిప్‌ రిపేర్‌యార్డ్‌, గోవాలోని నావల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ యార్డ్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్

మొత్తం ఖాళీలు: 173

* నావల్‌ షిప్‌ రిపేర్‌యార్డ్‌, కర్ణాటక-150

* నావల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ యార్డ్‌, గోవా-23

విభాగాలు: కార్పెంటర్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, డీజిల్‌ మెకానిక్‌, పెయింటర్‌, ప్లంబర్‌, టెయిలర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 50శాతం మార్కులతో 10వ తరగతి, కనీసం 65 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 14-21 ఏళ్లు మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.7700 వరకు చెల్లి్స్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కుల్లో మెరిట్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: The Officer-in-Charge, Dockyard Apprentice School, Naval Ship Repair Yard, Naval Base, Karwar, Karnataka -581 308

దరఖాస్తు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గేమింగ్‌ రంగానికి ఉజ్జ్వల భవిత

‣ ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?

Notification Information

Posted Date: 22-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :