• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1074 వివిధ ఖాళీలు 

భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిర‌న డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(డీఎఫ్‌సీసీఐఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు 1074

పోస్టులు: జూనియ‌ర్ మేనేజ‌ర్‌, ఎగ్జిక్యూటివ్‌లు, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌.

విభాగాలు: సివిల్‌, ఆప‌రేష‌న్స్, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, సిగ్న‌ల్ అండ్ టెలిక‌మ్యునికేష‌న్ త‌దిత‌రాలు. 

అర్హ‌త‌: 

1. జూనియ‌ర్ మేనేజ‌ర్: సంబంధిత విభాగాన్ని అనుస‌రించి బ్యాచిల‌ర్స్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌/ మెక‌ట్రానిక్స్ ఇంజినీరింగ్‌/ ప్రొడ‌క్ష‌న్ ఇంజినీరింగ్‌/ ఆటోమొబైల్‌/ కంట్రోల్‌/ మాన్యుఫాక్చ‌రింగ్ ఇంజినీరింగ్‌ ‌), ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీఎం ఉత్తీర్ణ‌త‌.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.50000 నుంచి రూ.160000 వ‌ర‌కు చెల్లిస్తారు. 

2. ఎగ్జిక్యూటివ్‌: సంబంధిత విభాగాన్ని అనుస‌రించి  డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌/ ప‌వ‌ర్ స‌ప్లై/ ఇండ‌స్ట్రియ‌ల్‌/ అప్ల‌యిడ్ ఎల‌క్ట్రానిక్స్‌, మైక్రోప్రాసెస‌ర్‌/ క‌మ్యునికేష‌న్‌/ డిజిట‌ల్ ఎల‌క్ట్రానిక్స్‌/ కంప్యూట‌ర్ అప్లికేష‌న్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణ‌త‌.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.30000 నుంచి రూ.120000 వ‌ర‌కు చెల్లిస్తారు.

3. జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌: 10వ త‌ర‌గ‌తి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

జీత‌భ‌త్యాలు:  నెల‌కు రూ.25000 నుంచి రూ.68000 వ‌ర‌కు చెల్లిస్తారు.

వ‌యసు: 

1. జూనియ‌ర్ మేనేజ‌ర్: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

2. ఎగ్జిక్యూటివ్‌: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

3. జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌, స‌ర్టిఫికేట్‌ వెరిఫికేష‌న్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: 23.07.2021.

Notification Information

Posted Date: 20-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :