• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NICMAR: నిక్‌మార్‌, పుణెలో పీజీ ప్రోగ్రాములు 

పుణెలోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ (నిక్‌మార్‌) 2022 సంవ‌త్స‌రానికిగానూ కింది పీజీ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* నిక్‌మార్ - పీజీ ప్రోగ్రాములు 2022

ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్న ప్రాంగ‌ణాలు: పుణె, హైద‌రాబాద్‌, గోవా, దిల్లీ ఎన్‌సీఆర్‌.

కాల వ్య‌వ‌ధి: రెండేళ్లు/ ఏడాది

విభాగాలు: 

1) అడ్వాన్స్‌డ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ మేనేజ్‌మెంట్ (పీజీపీ-ఏసీఎం)

2) ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (పీజీపీ-ఈపీఎం)

3) రియ‌ల్ ఎస్టేట్ అండ్ అర్బ‌న్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ మేనేజ్‌మెంట్ (పీజీపీ-ఆర్‌ఈయూఐఎం)

4) ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫైనాన్స్‌, డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ (పీజీపీ-ఐఎఫ్‌డీఎం)

5) మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ బిజినెస్ (పీజీపీ-ఎంఎఫ్ఓసీబీ)

6) క్వాంటిటీ స‌ర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ (పీజీపీ-క్యూఎస్‌సీఎం)

7) హెల్త్‌, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ (పీజీపీ-హెచ్ఎస్ఈఎం)

అర్హ‌త‌: క‌నీసం 50% అగ్రిగేట్ మార్కులతో సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక‌: నిక్‌మార్ కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (ఎన్‌సీఏటీ), గ్రూప్‌ డిస్కషన్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. ఎన్‌సీఏటీ, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ రెండింటికి విద్యార్థులు త‌మ ఇంటి వ‌ద్ద‌ నుంచి హాజ‌రుకావ‌చ్చు.

ప‌రీక్షా విధానం: ఈ ప‌రీక్ష‌ను మొత్తం 300 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇందులో నిక్‌మార్ కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్‌(ఎన్‌సీఏటీ) 180 మార్కుల‌కు ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ అండ్ అన‌లైటిక‌ల్ ఎబిలిటీ 72, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ 36, వ‌ర్బ‌ల్ అండ్ జ‌న‌ర‌ల్ ఎబిలిటీ 72 మార్కు‌లకు నిర్వ‌హిస్తారు. 

మిగిలిన 120 మార్కులకి గ్రూప్‌ డిస్కషన్‌ 20 మార్కులు, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ 30 మార్కుల‌కి, రేటింగ్ ఆఫ్ అప్లికేష‌న్‌కు 70 మార్కులకి ఉంటాయి.

ప‌రీక్ష తేది: 2022 జనవరి 08, 09.

గ్రూప్‌ డిస్కషన్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ తేదీలు: 2022 జనరవి 13-18.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 10.12.2021

చిరునామా: Dean-Admissions, NICMAR, 25/1, Balewadi, N.I.A. Post Office, Pune - 411045. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 

* ఏయూలో ‘అమెరికన్‌ కార్నర్‌’ ప్రారంభం

* ఏపీలో 1959 మెడికల్‌ పోస్టులు

* ‘గీతం’ దూరవిద్యపై యూజీసీ నిషేధం

 

Notification Information

Posted Date: 26-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :