• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APPSC: ఏపీపీఎస్సీ- ఆయుష్‌లో 151 మెడికల్‌ ఆఫీసర్లు

విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆయుష్‌ విభాగం(ఆయుర్వేద, హోమియోపతి, యునానీ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 151

1) మెడికల్‌ ఆఫీసర్లు (ఆయుర్వేద): 72 (కేరీ ఫార్వర్డ్‌ ఖాళీలు-13, తాజా ఖాళీలు-59)

2) మెడికల్‌ ఆఫీసర్లు (హోమియోపతి): 53 (కేరీ ఫార్వర్డ్‌ ఖాళీలు-01, తాజా ఖాళీలు-52)

3) మెడికల్‌ ఆఫీసర్లు (యునాని): 26 (కేరీ ఫార్వర్డ్‌ ఖాళీలు-21, తాజా ఖాళీలు-05)

అర్హత: ఆయుర్వేద, హోమియోపతి, యునానీలోలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా రిజిస్టర్‌ అయి ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.37100 నుంచి రూ.91450 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్‌ టైప్‌ విధానంలో నిర్వహిస్తారు. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. దీన్ని మొత్తం 450 మార్కులకి నిర్వహిస్తారు. ఈ పరీక్షని ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే నిర్వహిస్తారు.

పేపర్‌ 1  జనరల్‌ స్టడీస్‌ & మెంటల్‌ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు
పేపర్‌ 2  సంబంధిత సబ్జెక్టు     150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021

దరఖాస్తులకి చివరి తేది: 25.10.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 

‣ మేటి భవితకు మల్టీ డిసిప్లినరీ కోర్సు

‣ పచ్చదనం పెంపులో వెనకంజ

 

Notification Information

Posted Date: 25-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :