దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(ఎస్‌ఎంఎస్), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్‌టీవో) పోస్టుల భర్తీతో పాటు జాతీయ అర్హత పరీక్ష(నెట్)-2023 నిర్వహణకు సంబంధించి న్యూదిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏఎస్‌ఆర్‌బీ) ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 22 నుంచి ఏప్రిల్ 10 తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వివరాలు:
1. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్)-2023
2. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(ఎస్‌ఎంఎస్): 163 పోస్టులు
3. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్‌టీవో): 32 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 195.
విభాగాలు: అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ఎకనామిక్ బోటనీ అండ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనిమల్ బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సైన్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 10.04.2023 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నెట్‌కు సంబంధించి 01.01.2023 నాటికి అభ్యర్థి 21 ఏళ్ల నిండి ఉండాలి. దీనికి గరిష్ఠ వయోపరిమితి లేదు.
జీత భత్యాలు: నెలకు ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో పోస్టులకు రూ.56,100 - రూ.1,77,500 ఉంటుంది.
నెట్, ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో-2023 ఉత్తీర్ణత మార్కులు: యూఆర్ అభ్యర్థులకు 75.0 (50%), ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ 67.5 (45%), ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 60.0 (40%).
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము:
నెట్‌కు రూ.1000(ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250)
ఎస్‌ఎంఎస్‌కు రూ.500(ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎస్‌టీవోకు రూ.250(ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ/ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభం: 22-03-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-04-2023.
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: 26 నుంచి 30-4-2023 వరకు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రీయ సంస్థల్లో యూజీ.. పీజీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 330 మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్ పోస్టులు
BECIL: న్యూదిల్లీ ఎయిమ్స్‌లో 155 డేటా ఎంట్రీ ఆపరేటర్, రేడియోగ్రాఫర్ పోస్టులు
C-DAC: సీడ్యాక్, నోయిడాలో 140 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
DMHO: తూర్పు గోదావరి జిల్లాలో ఎంవో, ల్యాబ్ టెక్నీషియన్
AP DASCD: విశాఖపట్నం జిల్లాలో బ్యాక్లాగ్ స్పెషల్ రిక్రూట్‌మెంట్
DMHO: శ్రీకాకుళం జిల్లాలో ఫార్మాసిస్ట్, ఎంఎన్‌వో పోస్టులు
DMHO: శ్రీకాకుళం జిల్లాలో ఎంవో, పారా మెడికల్ పోస్టులు
DPH&FW: నాగర్‌కర్నూలు జిల్లాలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
TSNPDCL: ఎన్పీడీసీఎల్లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు
TCIL: టీసీఐఎల్‌లో 09 మేనేజర్ ఖాళీలు
IICA: ఐఐసీఏ-గురుగావ్‌లో 08 వివిధ పోస్టులు
NIMS: నిమ్స్‌లో న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ పోస్టులు
RCFL: ఆర్సీఎఫ్ఎల్-ముంబయిలో 11 వివిధ పోస్టులు
ISRO: ఇస్రో-హైదరాబాద్‌లో 34 వివిధ ఖాళీలు
DSC: ప్రకాశం జిల్లాలో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్
DSC: అనంతపురం జిల్లాలో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్
UOH: యూవోహెచ్‌లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టు
WCDSCD: ఆదిలాబాద్ జిల్లాలో జెండర్ స్పెషలిస్ట్, ఎంటీఎస్ పోస్టులు
Vizianagaram: విజయనగరం జిల్లాలో ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులు
AP DASCD: విజయనగరం జిల్లాలో స్పెషల్ బ్యాక్లాగ్ రిక్రూట్‌మెంట్