• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Bob Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 325 పోస్టులు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

మొత్తం ఖాళీలు: 325

1) రిలేషనల్‌షిప్‌ మేనేజర్లు: 175

2) క్రెడిట్‌ అనలిస్టులు: 150

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు ఫైనాన్స్‌ విభాగంలో పీజీ డిగ్రీ/ సీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

1) రీజనింగ్‌ 25 ప్రశ్నలు 25 మార్కులు
2) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు 25 మార్కులు
3) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు 25 మార్కులు
4) ప్రొఫెషనల్‌ నాలెడ్జ్ 75 ప్రశ్నలు 150 మార్కులు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.06.2022.

దరఖాస్తులకు చివరి తేది: 12.07.2022.

 

ఐడీబీఐలో 226 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

 

Some More Notifications

CSIR, CSIO - Indo Swiss Training Centre Various Programs

NIEPID, Secunderabad - Various Diploma Courses

IHM, Pusa - Diploma Programs

Cochin Shipyard - Marine Engineering Training Program

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Notification Information

Posted Date: 22-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :