• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CISF: సీఐఎస్‌ఎఫ్‌లో 540 ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్… అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్): 122 పోస్టులు (పురుషులు- 94, మహిళలు- 10, డిపార్ట్‌మెంటల్- 18)

2. హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్): 418 పోస్టులు (పురుషులు- 319, మహిళలు- 36, డిపార్ట్‌మెంటల్- 63)

మొత్తం ఖాళీల సంఖ్య: 540

అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ (10+2) సర్టిఫికేట్ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29200-92300, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25500-81100.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.10.2022.
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ

‣ ఏఈఈ కొలువుల‌కు ఎలా సిద్ధం కావాలి?

‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

Notification Information

Posted Date: 11-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :