• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UPSC: కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2023

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఖాళీల వివరాలు..

కేటగిరీ-1: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గనుల మంత్రిత్వ శాఖ.

1. జియాలజిస్ట్, గ్రూప్-ఎ: 216 పోస్టులు

2. జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ: 21 పోస్టులు

3. కెమిస్ట్, గ్రూప్-ఎ: 19 పోస్టులు

కేటగిరీ-2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ.

4. సైంటిస్ట్ ‘బి’(హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ: 26 పోస్టులు

5. సైంటిస్ట్ ‘బి’(కెమికల్), గ్రూప్-ఎ: 01 పోస్టు

6. సైంటిస్ట్ ‘బి’(జియోఫిజిక్స్) గ్రూప్-ఎ: 02 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 285.

అర్హత: మాస్టర్ డిగ్రీ(జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్)- అప్లైడ్ జియోఫిజిక్స్.

వయోపరిమితి: 1.1.2023 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఎంపిక, పరీక్ష విధానం: స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, దిల్లీ, దిస్‌పూర్, హైదరాబాద్, జైపుర్, జమ్ము, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్(అలహాబాద్), షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11-10-2022.

దరఖాస్తుల ఉపసంహరణ తేదీలు: 19.10.2022 నుంచి 25.10.2022 వరకు.

ప్రిలిమినరీ ప‌రీక్ష తేదీ: 19-02-2023.

మెయిన్ పరీక్ష తేదీలు: 24 & 25-06-2023 
 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Notification Information

Posted Date: 21-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :