• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Dr. YSR VHC: వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో 1,681 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌- హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో సేవలు అందించడానికి ఒప్పంద ప్రాతిపదికన 1,681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) ఖాళీల భర్తీకి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

వివరాలు...

మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ): 1,681 పోస్టులు

అర్హతలు: ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నాటికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అయిదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.25,000

ఎంపిక, పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ పరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికలుంటాయి. బీఎస్సీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచి 200 ప్రశ్నలకు బహుళైచ్ఛిక విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఆగస్టు 9 నుంచి 22వ తేదీ వరకు.

హాల్‌టికెట్లు జారీ: 24 నుంచి 30వ తేదీ వరకు.

పరీక్ష నిర్వహణ: సెప్టెంబర్‌ మొదటి వారంలో. 
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ GATE: గెలుద్దాం.. గేట్‌!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

Notification Information

Posted Date: 06-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :