• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Eastern Command: ఈస్ట‌ర్న్ క‌మాండ్‌లో గ్రూప్‌-సి పోస్టులు

కోల్‌క‌తా(ఫోర్ట్ విలియం)లోని ఈస్ట‌ర్న్ క‌మాండ్ సిగ్న‌ల్ రెజిమెంట్‌(ఈసీఎస్ఆర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 10

పోస్టులు: కుక్‌, వాష‌ర్‌మెన్‌, బార్బ‌ర్‌, స్వీప‌ర్‌, మెస్సెంజ‌ర్‌.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌ని అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 01.09.2021 నాటికి 18 నుంచి 25 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.18,000 నుంచి రూ.63,200 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ప్రాక్టిక‌ల్ టెస్ట్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ప‌రీక్ష విధానం: రాత ప‌రీక్ష మొత్తం 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి.

1) జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్    25 ప్ర‌శ్న‌లు   25 మార్కులు
2) జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్       25 ప్ర‌శ్న‌లు   25 మార్కులు
3) న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్   25 ప్ర‌శ్న‌లు   25 మార్కులు
4) జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ రీజ‌నింగ్    25 ప్ర‌శ్న‌లు   25 మార్కులు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: ది క‌మాండింగ్ ఆఫీస‌ర్‌, హెడ్‌క్వార్ట‌ర్ ఈస్ట‌ర్న్ క‌మాండ్ సిగ్న‌ల్ రెజిమెంట్, ఫోర్ట్ విలియం, కోల్‌క‌తా-21.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 24.10.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీలో 251 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

‣ 6 నెలల్లో 2,500 నియామకాలు: హెచ్‌డీఎఫ్‌సీ

‣ మూడేళ్లలో 10వేల నియామకాలు: మౌరిటెక్‌

 

 

Notification Information

Posted Date: 28-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :