• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SAI: సాయ్‌లో 220 అసిస్టెంట్‌ కోచ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకి చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* అసిస్టెంట్‌ కోచ్‌లు

మొత్తం ఖాళీలు: 220

క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్, బాక్సింగ్‌, సైక్లింగ్‌, ఫెన్సింగ్, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, కయాకింగ్‌, ఖో ఖో, రోయింగ్‌, సెపక్‌ తక్రా, షూటింగ్, సాఫ్ట్‌బాల్, స్విమ్మింగ్, టేబుల్‌ టెన్నిస్‌, తైక్వాండో, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్‌, ఉషు.

అర్హత: సాయ్‌, ఎన్‌ ఎన్‌ఐఎస్‌/ ఇతర ఇండియన్‌/ ఫారిన్‌ యూనివర్సిటీల నుంచి కోచింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత/ ఒలింపిక్‌/ ఇంటర్నేషనల్‌లో పాల్గొనడం/ ద్రోణాచార్య అవార్డు సాధించి ఉండాలి.

వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.41,420 నుంచి రూ.112,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: క్రీడా విజయాలు, అనుభవం, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.08.2021.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 10.10.2021.

Notification Information

Posted Date: 25-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :