• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RBI: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు

ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు… దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

‌ఖాళీల వివరాలు:

అసిస్టెంట్: 450 పోస్టులు

శాఖల వారీగా ఖాళీలు:

అహ్మదాబాద్- 13

బెంగళూరు- 58

భోపాల్- 12

భువనేశ్వర్- 19

చండీగఢ్- 21

చెన్నై- 1

గువాహటి- 26

హైదరాబాద్- 14

జైపుర్- 5

జమ్మూ- 18

కాన్పుర్, లఖ్‌నవూ- 55

కోల్‌కతా- 22

ముంబయి- 101

నాగ్‌పుర్ - 19

న్యూదిల్లీ - 28

పట్నా - 1

తిరువనంతపురం, కొచ్చి - 16

మొత్తం ఖాళీల సంఖ్య: 450.

అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. పీసీ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.

వయస్సు: 01-09-2023 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల(జనరల్‌) సడలింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ.20,700 నుంచి రూ.55700.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష విధానం: ప్రాథమిక పరీక్ష(ఆబ్జెక్టివ్‌)లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(30 ప్రశ్నలు- 30 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు), రీజనింగ్‌ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రధాన పరీక్ష(ఆబ్జెక్టివ్‌)లో రీజనింగ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ(40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్‌ నాలెడ్జ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.50.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 13-09-2023 నుంచి 04-10-2023 వరకు.

ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు: 13-09-2023 నుంచి 04-10-2023 వరకు.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ టెస్ట్ తేదీలు: 21-10-2023, 23-10-2023.

ఆన్‌లైన్ మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీ: 02-12-2023.


 

మరింత సమాచారం... మీ కోసం!

ఐఐటీ-ధన్‌బాద్‌లో 71 ప్రొఫెసర్‌ ఖాళీలు

 నిట్‌-రాయ్‌పుర్‌లో 23 ఫ్యాకల్టీ పోస్టులు 

ఇండియన్‌ నేవీ-46 అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఖాళీలు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 13-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :