కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా.. భారత నౌకాదళంలో అగ్నివీర్(ఎంఆర్) ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2023 (నవంబర్ 23) బ్యాచ్ పేరున శిక్షణ ఉంటుంది. మే 29 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
అగ్నివీర్ (మెట్రిక్ రిక్రూట్- ఎంఆర్): 100 పోస్టులు (పురుషులు- 80, మహిళలు- 20)
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: అభ్యర్థి 01.11.2002 – 31.04.2005 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం.మీ., మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
శిక్షణ: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 మార్కులను కలిగి ఉంటుంది. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.550.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 29-05-2023.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15-06-2023.
శిక్షణ ప్రారంభం: 2023, నవంబర్ నెలలో.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రామర్ తెలిస్తే మార్కులు ఈజీ
‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ
‣ షిప్పింగ్ కోర్సులతో మేటి అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NITAP: నిట్ ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
RBI: రిజర్వ్ బ్యాంకులో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
BDL: బీడీఎల్-హైదరాబాద్‌లో 12 పోస్టులు
MANUU: మనూ, హైదరాబాద్‌లో 47 టీచింగ్ పోస్టులు
APSFC: ఏపీఎస్ఎఫ్సీ, విజయవాడలో 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
THDC: టీహెచ్‌డీసీ లిమిటెడ్, దేహ్రాదూన్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు
NHPC: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, ఫరీదాబాద్‌లో 388 జూనియర్ ఇంజినీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులు
SBI: ఎస్బీఐ బ్యాంక్-18 ఏజీఎం పోస్టులు
SBI: ఎస్బీఐ బ్యాంక్-09 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
WCDSCD: సంగారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: వికారాబాద్ జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: నారాయణపేట జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: జనగామ జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: కామారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCDSCD: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
WCD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్వాడీ ఖాళీలు
NIT: నిట్-మేఘాలయాలో ఫ్యాకల్టీ పోస్టులు
TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో టీచర్ పోస్టులు