• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ONGC: ఓఎన్‌జీసీలో 871 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్… గేట్ స్కోర్-2022 ద్వారా ఇ-1 స్థాయిలో ఇంజినీరింగ్, జియో-సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీల నియామకానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ఏఈఈ(సిమెంటింగ్)- మెకానికల్: 13 పోస్టులు

2. ఏఈ(సిమెంటింగ్)- పెట్రోలియం: 04 పోస్టులు

3. ఏఈఈ(సివిల్): 29 పోస్టులు

4. ఏఈఈ(డ్రిల్లింగ్)- మెకానికల్: 212 పోస్టులు

5. ఏఈఈ(డ్రిల్లింగ్)- పెట్రోలియం: 20 పోస్టులు

6. ఏఈఈ(ఎలక్ట్రానిక్స్): 22 పోస్టులు

7. ఏఈఈ(ఇన్‌స్ట్రుమెంటేషన్): 53 పోస్టులు

8. ఏఈఈ(మెకానికల్): 103 పోస్టులు

9. ఏఈఈ(ప్రొడక్షన్)- మెకానికల్: 39 పోస్టులు

10. ఏఈఈ(ప్రొడక్షన్)- కెమికల్: 60 పోస్టులు

11. ఏఈఈ(ప్రొడక్షన్)- పెట్రోలియం: 32 పోస్టులు

12. ఏఈఈ(పర్యావరణ): 11 పోస్టులు

13. ఏఈఈ(రిజర్వాయర్): 33 పోస్టులు

14. కెమిస్ట్: 39 పోస్టులు

15. జియాలజిస్ట్: 55 పోస్టులు

16. జియోఫిజిసిస్ట్(సర్ఫేస్‌): 54 పోస్టులు

17. జియోఫిజిసిస్ట్(వెల్స్): 24 పోస్టులు

18. ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 13 పోస్టులు

19. మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్: 32 పోస్టులు

20. ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌: 13 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 871.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌-2022 స్కోరు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 31.07.2022 నాటికి ఏఈఈ- డ్రిల్లింగ్/ సిమెంటింగ్ పోస్టులకు 28 ఏళ్లు; మిగిలిన ఖాళీలకు 30 ఏళ్లు మించకూడదు. 

జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.60,000 - రూ.180,000.

ఎంపిక ప్రక్రియ: గేట్-2022 స్కోరు, విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.300(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ చివరి తేది: 12-10-2022.
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?

‣ ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

‣ కనుమరుగవుతున్న లంకలు

‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా

Notification Information

Posted Date: 22-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :