• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ONGC: ఓఎన్‌జీసీలో 309 గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వ పెట్రోలియ, సహజ వాయువు మంత్రిత్వశాఖకి చెందిన మహారత్న సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పోరేషన్‌ (ఓఎన్‌జీసీ)  ఇంజినీరింగ్‌, జియోసైన్సెస్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు 

మొత్తం ఖాళీలు: 309

పోస్టులు: ఏఈఈ, కెమిస్ట్‌,జియాలజిస్ట్‌,జియోఫిజిసిస్ట్‌,మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్, ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌.

విభాగాలు: సిమెంటింగ్‌ మెకానికల్‌, సిమెంటింగ్‌ పెట్రోలియం, సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేషన్, కెమికల్‌, ఎన్విరాన్‌మెంట్‌, రిజర్వాయర్‌, సర్ఫేస్‌, వెల్స్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టు్ల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2021లో అర్హత సాధించి ఉండాలి.

వయసు: 31.07.2021 నాటికి పోస్టుల్ని అనుసరించి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలు, గేట్‌ 2021లో సాధించిన మెరిట్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకి గాను గేట్‌ 2021 స్కోర్‌కి 60 మార్కులు, విద్యార్హతలకి 25 మార్కులు, ఇంటర్వ్యూకి 15 మార్కులు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2021.

ఆన్‌లైన్ దరఖాస్తులకి చివరి తేది: 01.11.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

నీట్ ర్యాంకు సాధనకు అయిదు సూత్రాలు!

విదేశాల్లో వైద్యవిద్యకు వెళ్లాలా.. వద్దా?

మార్కుల మంత్రం.. సమయపాలనే! 

ఉపరితల రసాయనశాస్త్రం

Notification Information

Posted Date: 11-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :