• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SBI Recruitment:ఎస్‌బీఐలో 439 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టులు 

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్...  స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 439 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు:

* స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్: 439 పోస్టులు

కేడర్‌: అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టింగ్ స్థలం: నవీ ముంబయి/ హైదరాబాద్/ బెంగళూరు/ చండీగఢ్/ తిరువనంతపురం.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 16.09.2023 నుంచి 06.10.2023 వరకు.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 17-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :