• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SSC: ఎస్‌ఎస్‌సీ - 3261 (ఫేజ్‌ - IX) సెలక్షన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 3261

పోస్టులు: గర్ల్స్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, కెమికల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, మెడికల్‌ అటెండెంట్‌, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ (10+2), గ్రాడ్యుయేషన్, ఆపై ఉత్తీర్ణత.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది. దీన్ని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షకి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. దీనిలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 1 గంట (60 నిమిషాలు) ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి స్కిల్‌ టెస్ట్‌ (టైపింగ్‌/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ) ఉంటుంది. విద్యార్హత స్థాయి ఆధారంగా ప్రశ్నపత్రం ఉంటుంది.

1) జనరల్‌ ఇంటలిజెన్స్‌     25 ప్రశ్నలు   50 మార్కులు       
2) జనర్‌ అవేర్‌నెస్‌     25 ప్రశ్నలు   50 మార్కులు       
3) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (బేసిక్‌ అర్థమేటిక్‌ స్కిల్స్‌)    25 ప్రశ్నలు   50 మార్కులు       
4) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (బేసిక్‌ నాలెడ్జ్)    25 ప్రశ్నలు   50 మార్కులు       

 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు: 

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 25.10.2021.

* ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేది: 28.10.2021.

* కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష: 2022 జనవరి/ ఫిబ్రవరి.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 

‣ ప‌ర్యాట‌కంలో మేనేజ్‌మెంట్ ప‌ట్టాలు

‣ We cannot go there now

 

 

Notification Information

Posted Date: 25-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :