• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UPSC ESE-2023: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2023

న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమైంది. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 327 పోస్టులు భర్తీ కానున్నాయి.

వివరాలు...

* యూపీఎస్సీ- ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2023

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌.

మొత్తం ఖాళీలు: 327

విద్యార్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్ చ‌దివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్(ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలక్ట్రానిక్స్‌, రేడియో ఫిజిక్స్‌, రేడియో ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థులు వయసు 01-01-2023 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయాలి. 

ఎంపిక విధానం: స్టేజ్‌-1(ప్రిలిమినరీ/ స్టేజ్‌-1) ఎగ్జామ్‌, స్టేజ్‌-2(మెయిన్‌/ స్టేజ్‌-2) ఎగ్జామ్‌, స్టేజ్‌-3(పర్సనాలిటీ టెస్ట్‌), మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు. ఇతరులు రూ.200 చెల్లించాలి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 14-09-2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-10-2022.

నగదు ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03-10-2022.

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04-10-2022.

ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేది: 19-02-2023.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ

‣ ఏఈఈ కొలువుల‌కు ఎలా సిద్ధం కావాలి?

‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

Notification Information

Posted Date: 15-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :