తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 16న ప్రారంభం కానుంది. ప్రవేశాల ప్రక్రియ మూడు విడతలుగా జరగనుంది. జులై 17న తరగతులు మొదలవుతాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ కాలపట్టికను విడుదల చేసింది. మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు భర్తీ కానున్నాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు వివరాలు...
* రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, కొత్తగా ఏర్పాటైన మహిళా విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో బీబీఏ డేటా ఎనలిటిక్స్ కోర్సులోని 60 సీట్లను కూడా దీని ద్వారానే భర్తీ చేస్తారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 136 కలుపుకొని మొత్తం 1,054 కళాశాలలు దోస్త్ పరిధిలో ఉన్నాయి. దీని పరిధిలోకి రాని కళాశాలలు 63 ఉన్నాయి, వాటిలోని దాదాపు 35 సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి.
* ఈసారి బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పేరిట నాలుగేళ్ల కోర్సు ప్రవేశపెడుతున్నారు. ఆసక్తి లేనివారు మూడేళ్ల తర్వాత డిగ్రీ పట్టా తీసుకొని వెళ్లిపోవచ్చు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆ కోర్సు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఎస్టీ విద్యార్థులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. భారత్ పే ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
దోస్త్ కాలపట్టిక...
మొదటి విడత
రిజిస్ట్రేషన్: మే 16 నుంచి జూన్ 10 వరకు(రూ.200 రుసుం)
వెబ్ ఆప్షన్లు: మే 20 నుంచి జూన్ 11 వరకు
సీట్ల కేటాయింపు: జూన్ 16న
సీట్లు పొందినవారి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 16 నుంచి 25 వరకు
రెండో విడత
రిజిస్ట్రేషన్: జూన్ 16 నుంచి 26 వరకు(రూ.400 రుసుం)
వెబ్ ఆప్షన్లు: జూన్ 16 నుంచి 27 వరకు
సీట్ల కేటాయింపు: జూన్ 30న
సీట్లు పొందినవారి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జులై 1 నుంచి 5 వరకు
మూడో విడత
రిజిస్ట్రేషన్: జులై 1 నుంచి 5 వరకు(రూ.400 రుసుం)
వెబ్ ఆప్షన్లు: జులై 1 నుంచి 6 వరకు
సీట్ల కేటాయింపు: జులై 10న
సీట్లు పొందినవారి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జులై 10 నుంచి 14 వరకు
కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్(3 విడతల్లో సీట్లు పొంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినవారికి): జులై 10 నుంచి 15 వరకు
ఓరియంటేషన్ కార్యక్రమం: జులై 11-15
తరగతుల ప్రారంభం: జులై 17న
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు
‣ నౌకాదళంలో అధికారులుగా అవకాశం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
MANUU: మనూ-హైదరాబాద్లో ఐటీఐ ప్రవేశాలు
ICAR: ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్‌డీ)-2023
ICAR: ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2023
NLSIU: ఎన్ఎల్ఎస్ఐయూ, బెంగళూరులో ఆన్‌లైన్ అండ్ హైబ్రిడ్ ప్రోగ్రామ్
IIITK: ట్రిపుల్ ఐటీ కల్యాణిలో ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ప్రోగ్రామ్
AP Models School: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు
NITR: నిట్ రవూర్కెలాలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
NITR: నిట్ రవూర్కెలాలో ఎంబీఏ ప్రోగ్రామ్
NITR: నిట్ రవూర్కెలాలో ఎంఏ ప్రోగ్రామ్
IAV: ఐఏవీ-కేరళలో పీహెచ్‌డీ ప్రవేశాలు
NITW: నిట్ వరంగల్లో ఎంబీఏ ప్రోగ్రామ్
NITW: నిట్ వరంగల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
NID: నిడ్, అహ్మదాబాద్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
MDNIY: ఎండీఎన్ఐవైలో యోగా సైన్స్ ఫౌండేషన్ కోర్సు
IIFT: ఐఐఎఫ్టీ, న్యూదిల్లీలో ఎంఏ ప్రోగ్రామ్
TSITI: తెలంగాణలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2023
APRMJC: ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు
APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
GRI: గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్లో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్
NILD: ఎన్ఐఎల్డీ- కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023