• facebook
  • twitter
  • whatsapp
  • telegram

New India: న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీలో 300 పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు (జనరలిస్టులు) (స్కేల్‌-1)

మొత్తం ఖాళీలు: 300

అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. చివరి ఏడాది/ సెమిస్టర్‌ చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.04.2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.32795 నుంచి రూ.62315 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్‌, మెయిన్‌ ఎగ్జామ్‌ (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: 

ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. అవి

1) ఇంగ్లిష్ లాంగ్వేజ్‌           ఆబ్జెక్టివ్‌               30 మార్కులు

2) రీజనింగ్‌ ఎబిలిటీ          ఆబ్జెక్టివ్‌                35 మార్కులు

3) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌     ఆబ్జెక్టివ్‌            35 మార్కులు

పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారిని మెయిన్‌ ఎగ్జామ్‌కి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

మెయిన్‌ ఎగ్జామినేషన్‌: దీనిలో 200 మార్కులకి ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌, 30 మార్కులకి డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

1) టెస్ట్‌ ఆఫ్ రీజనింగ్‌                ఆబ్జెక్టివ్‌             50 మార్కులు             40 నిమిషాలు

2) టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌      ఆబ్జెక్టివ్‌             50 మార్కులు             40 నిమిషాలు

3) టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నెస్       ఆబ్జెక్టివ్‌             50 మార్కులు           30 నిమిషాలు

4) టెస్ట్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌   ఆబ్జెక్టివ్‌          50 మార్కులు          40 నిమిషాలు

దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌కి ఎంపిక చేస్తారు. దీన్ని మొత్తం 30 మార్కులకి నిర్వహిస్తారు. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది. టెస్ట్‌ ఆఫ్ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (లెటర్‌ రైటింగ్‌ 10 మార్కులు, ఎస్సే 20 మార్కులు) ఉంటుంది.

* అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో కనీస స్కోరు సాధించాలి. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల్ని చివరిగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. మెయిన్‌ ఎగ్జామ్‌ (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌), ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100, ఇతర అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రి ప్రారంభం: 01.09.2021.

దరఖాస్తులకి చివరి తేది: 21.09.2021.

ఫేజ్‌ 1 ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌: అక్టోబరు 2021.

ఫేజ్‌ 2 ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌: నవంబరు 2021.

Notification Information

Posted Date: 24-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :