• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Scholorships: కేఎస్‌బీ- ప్రధానమంత్రి ఉపకారవేతనాల పథకం 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌ (కేఎస్‌బీ) 2021-2022 విద్యాసంవత్సరానికి ప్రధానమంత్రి ఉపకారవేతనాల పథకం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా మాజీ సైనిక ఉద్యోగుల వితంతువులు/ సంరక్షకులు/ మాజీ ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బందికి చెందిన విద్యార్థులకు ప్రొఫెషనల్‌/ టెక్నికల్‌ డిగ్రీ కోర్సులు కొనసాగించడానికి ఉపకారవేతనాలు అందిస్తారు.

వివరాలు..

* కేఎస్‌బీ- ప్రధానమంత్రి ఉపకారవేతనాల పథకం 

మొత్తం ఉపకారవేతనాలు: 5500 (బాలురు 2750, బాలికలు 2750)

అర్హత: ప్రొఫెషనల్‌/ టెక్నికల్‌ డిగ్రీ కోర్సుల్లో మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులు అర్హులు. ఇంటర్మీడియట్‌/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్‌లో 60శాతం మార్కులు సాధించి ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు చదివే అభ్యర్థులు అర్హులు కాదు.

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రకటనలో చూపిన ప్రాధాన్యత క్రమాల ప్రకారం ఉపకారవేతనాలు అందిస్తారు.

స్కాలర్‌షిప్‌ మొత్తం: బాలురకు సంవత్సరానికి రూ.30000, బాలికలకు సంవత్సరానికి రూ.36000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.12..2021.

నోటిఫికేషన్: https://ksb.gov.in/introduction-pmss.htm

 

 


మరింత సమాచారం ... మీ కోసం!

డీఆర్‌డీఓ-సీఏఐఆర్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు 

ఓపీఏఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 

స్విమ్స్‌, తిరుపతిలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు 

హెచ్‌ఎన్‌బీజీయూ 226 టీచింగ్‌ పోస్టులు

 

Notification Information

Posted Date: 29-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :