• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PM Scholarships: పేద ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు

షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద‌ విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2022-23 ఏడాదికి గాను అర్హులైన ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌ పేరిట సాయమందిస్తోంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు పైచదువుల కోసం రూ.2,500 నుంచి రూ.13,500 వరకు ఉపకార వేతనాన్ని ఇస్తోంది.

అర్హతా నిబంధనలు:

* పదో తగరగతి పూర్తి చేసి గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాల‌ర్‌షిప్‌ల‌కు అర్హులు. వీటిని ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి మాత్రమే అందిస్తారు. అందులోనూ కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. భారతదేశంలో చ‌దివే పిల్లలకే ఈ స్కాల‌ర్‌షిప్‌లు వ‌ర్తిస్తాయి. ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌, ఎంపిక బాధ్యత రాష్ట్రాల‌పైనే ఉంటుంది. విద్యార్థులు చేరే సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి.

ఒక ఏడాదికి అందించే ఉపకార వేతన అంశాలు:

* విద్యాస్థాయిని బట్టి స్కాల‌ర్‌షిప్‌ అందిస్తారు. ఈ మేరకు కేటగిరీలుగా విభజించారు. 

గ్రూప్‌ 1(డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్‌ కోర్సులు): డే స్కాలర్‌- రూ.7000, హాస్టల్‌లో ఉండేవారికి- రూ.13,500

గ్రూప్‌ 2(డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు): డే స్కాలర్‌- రూ.6500, హాస్టల్‌లో ఉండేవారికి- రూ.9500

గ్రూప్‌ 3(గ్రూప్‌ 1, 2 పరిధిలో లేని గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్లు): డే స్కాలర్‌- రూ.3000, హాస్టల్‌లో ఉండేవారికి- రూ.6000\

గ్రూప్‌ 4(అన్ని పోస్టు మెట్రిక్యులేషన్‌, నాన్‌-డిగ్రీ కోర్సులు): డే స్కాలర్‌- రూ.2500, హాస్టల్‌లో ఉండేవారికి- రూ.4000

* దివ్యాంగ విద్యార్థులకు 10% అదనపు భత్యం అందుతుంది.

దరఖాస్తు విధానం: అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Notification Information

Posted Date: 23-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :