కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆసరా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (యశస్వి) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
యశస్వి అనేది ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), డీ-నోటిఫైడ్, నోమాడిక్ & సెమీ నోమాడిక్ ట్రైబ్స్(డీఎన్టీ/ ఎస్ఎన్టీ) వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ పథకం.
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో తొమ్మిదో తరగతి లేదా పదకొండో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించని తల్లిదండ్రుల విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష- యశస్వి ప్రవేశ పరీక్ష-2022 ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: అమరావతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్.
పరీక్ష విధానం: ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బహుళైచ్చిక ప్రశ్నలుంటాయి. వ్యవధి 3 గంటలు. గణితం, సైన్స్, సోషల్ సైన్స్, జనరల్ అవేర్నెస్/ నాలెడ్జ్ సబ్జెక్ట్‌ల్లో ప్రశ్నలుంటాయి. ప్రశ్నల సంఖ్య 100, ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26-08-2022.
దరఖాస్తు సవరణలకు అవకాశం: 27.08.2022 నుంచి 31.08.2022 వరకు.
హాల్‌టికెట్ డౌన్లోడ్ తేది: 05.09.2022 నుంచి
పరీక్ష తేది: 11.09.2022.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం
Minority Scholarships: మైనారిటీ విద్యార్థులకు ఉపకారం
JVVD Scheme: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2022
HDFC: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ స్కాలర్షిప్
Postal Department: తపాలా శాఖ - స్పర్ష్ యోజన స్కాలర్షిప్ ప్రోగ్రాం
ICMR-JRF: ఐసీఎంఆర్‌లో జేఆర్ఎఫ్ 2022
PM Scholarships: పేద ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు