Q.

బుద్ధుడి జనన - మరణ ప్రాంతాలు వరుసగా

  • కుశీ నగరం - లుంబినీ వనం
  • లుంబినీ వనం - కుశీ నగరం
  • లుంబినీ వనం - గయ
  • కుశీ నగరం - పావపురి
Answer: లుంబినీ వనం - కుశీ నగరం

Q.

భారతదేశ మూడు దశల న్యూక్లియర్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించి సరైంది?

ఎ) మొదటి దశలో ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్‌లను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.

బి) రెండో దశలో ఫాస్ట్‌బ్రీడర్‌ రియాక్టర్‌లను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.

సి) మూడో దశలో అడ్వాన్స్‌డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్‌లను ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.

  • ఎ, బి
  • ఎ, బి, సి
  • బి, సి
  • ఎ, సి
Answer: ఎ, బి, సి

Q.

లెడ్‌ పెన్సిల్‌లో ఉపయోగించే మూలకం?

  • గ్రాఫిన్‌
  • కోల్‌తార్‌
  • గ్రాఫైట్‌
  • బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌
Answer: గ్రాఫైట్‌

Q.

గవర్నర్‌తో ఎవరు ప్రమాణస్వీకారం చేయిస్తారు?

  • రాష్ట్రపతి
  • హైకోర్టు ప్రధాన న్యాయయూర్తి
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • ప్రధానమంత్రి
Answer: హైకోర్టు ప్రధాన న్యాయయూర్తి

Q.

‘అంతరాళం, సంఖ్యకు సంబంధించిన శాస్త్రం గణితశాస్త్రం’ అని ఎవరు నిర్వచించారు?

  • గణిత నిఘంటువు
  • రస్సెల్‌
  • అరిస్టాటిల్‌
  • పైథాగరస్‌
Answer: గణిత నిఘంటువు

Q.

సముద్ర మాంసం ఒక రకమైన వాసనతో ఉంటుంది. దాన్ని ఏమంటారు?

  • ఉమామి
  • హచింగ్‌
  • మెటాలిక్‌ టేస్ట్‌
  • 1, 2
Answer: ఉమామి

Q.

దక్షిణ అమెరికాలోని పంపాల ప్రాంతంలోని శీతల ధ్రువ పవనాలను ఏమంటారు?    

  • ప్యూనా
  • మిస్ట్రాల్‌
  • పాంపెరో
  • సైమూన్‌
Answer: పాంపెరో

Q.

బుద్ధుడి జనన మరణాల వరుస క్రమం-

  • క్రీ.పూ. 563 - క్రీ.పూ. 463
  • 563 సంవత్సరాల క్రితం - 463 సంవత్సరాల క్రితం
  • క్రీ.పూ. 563 - క్రీ.పూ. 483
  • క్రీ.శ. 483 - క్రీ.శ. 563
Answer: క్రీ.పూ. 563 - క్రీ.పూ. 483

Q.

అల్లావుద్దీన్‌ ఖిల్జీ సంస్కరణల్లో సరైనవి?

ఎ) గుర్రాలకు ముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు.

బి) ధరలు నియంత్రించి సైనికులకు నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చాడు.

సి) మార్కెటింగ్‌ సంస్కరణల పర్యవేక్షణ కోసం మాలిక్‌-యాకూబ్‌ అనే అధికారిని నియమించాడు.

డి) ఖిల్జీ ప్రారంభించిన ధరలు నియంత్రించే శాఖ దివాన్‌-ఇ-రియాఫత్‌

  • ఎ, బి, సి, డి
  • ఎ, బి, సి
  • బి, డి
  • బి, సి, డి
Answer: ఎ, బి, సి, డి

Q.

కిందివాటిలో రుచి కానిది?

  • పులుపు
  • చేదు
  • తీపి
  • కారం
Answer: కారం