Q.

ప్రస్తుతం ఉపయోగించే మీటర్‌ స్కేలును ఏ పదార్థంతో తయారు చేస్తారు?

  • ప్లాటినం, కాపర్‌
  • అల్యూమినియం, కాపర్‌
  • ప్లాటినం, ఇరిడియం
  • అల్యూమినియం, ఇరిడియం
Answer: ప్లాటినం, ఇరిడియం

Q.

పప్పుల ధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?

  • 1వ
  • 2వ
  • 3వ
  • 4వ
Answer: 1వ

Q.

ఏ ఆహారపు గొలుసులోనైనా అత్యధిక సంఖ్యలో ఏ జనాభా ఉంటుంది? 

  • ప్రాథమిక వినియోగదారులు
  • తృతీయ వినియోగదారులు
  • ఉత్పత్తిదారులు
  • విచ్ఛిన్నకారులు
Answer: ఉత్పత్తిదారులు

Q.

‘గణితంలోని అన్ని భావనలు అంటే అంకగణితం, బీజగణితం, విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు’ అని పేర్కొన్నవారు?

  • ఆగస్ట్‌ కోమ్టే
  • బెంజిమన్‌ పియర్స్‌
  • లాక్‌
  • సి.జి.హెంపెల్‌
Answer: సి.జి.హెంపెల్‌

Q.

జైనమతంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు?

ఎ) గిర్నార్‌ (రాజ్‌గిరి)             బి) మౌంటు అబు (మధుర) 

సి) చంద్రగిరి (భువనేశ్వర్‌)       డి) శ్రావణ బెళగొళ (కర్ణాటక)

  • ఎ, బి, సి, డి
  • డి మాత్రమే
  • బి, డి మాత్రమే
  • సి మాత్రమే
Answer: ఎ, బి, సి, డి

Q.

నీటిలో నానబెట్టిన 40 నిమిషాల్లో ఆహారం తయారయ్యే వరి రకాలు? 

  • నల్‌బోరా
  • అగాని
  • బొగాలి
  • పైవన్నీ
Answer: పైవన్నీ

Q.

10 ఆపిల్స్‌ను రూ.50 లకు కొని, 15 ఆపిల్స్‌ను రూ.60 లకు అమ్మినా.. మొత్తంమీద లాభమా, నష్టమా, ఎంత శాతం?

  • లాభం 25%
  • నష్టం 20%
  • లాభం 20%
  • నష్టం 25%
Answer: నష్టం 20%

Q.

కిందివాటిలో ఏ భాగం వెలుపలి చెవి, మధ్య చెవికి మధ్యలో ఉంటుంది?

  • కర్ణభేరి
  • శ్రవణ కుహరం
  • పిన్నా
  • ఆడిటరీ మీటర్‌
Answer: కర్ణభేరి

Q.

బాక్ట్రియాను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు?

  • బాలీ
  • బాల్క్‌
  • శకులు
  • కాబూల్‌
Answer: బాల్క్‌

Q.

కిందివాటిలో రాజ్యసభ ప్రత్యేకాధికారం గురించి తెలియజేయని అధికరణ?

  • 249
  • 312
  • 67(b)
  • 81
Answer: 81