• facebook
  • whatsapp
  • telegram

పేద విద్యార్థులకు 63 లక్షల స్కాలర్ షిప్ లు

ఎస్సీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం సాయం!

కుటుంబ వార్షికాదాయ పరిమితి రూ.2.5 లక్షలు 

షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద‌ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారు ఉన్న‌త చ‌దువులు చ‌దివేందుకు ఎలాంటి ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే లక్ష్యంతో ఏటా ఆర్థికంగా ఆదుకుంటోంది. ఎస్సీ అభ్యర్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌ పేరిట సాయమందిస్తోంది. దీని వల్ల సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020-21 నుంచి 2025-26 వరకు మొత్తం అయిదేళ్ల కాలంలో మొత్తం 63 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు పైచదువుల కోసం రూ.2,500 నుంచి రూ.13,500 వరకు స్కాల‌ర్‌షిప్‌ ఇస్తోంది.

ఎవరు అర్హులు?

పదో తగరగతి పూర్తి చేసి గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాల‌ర్‌షిప్‌ల‌కు అర్హులు. వీటిని ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి మాత్రమే అందిస్తారు. అందులోనూ కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. భారతదేశంలో చ‌దివే పిల్ల‌ల‌కే ఈ స్కాల‌ర్‌షిప్‌లు వ‌ర్తిస్తాయి. ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌, ఎంపిక బాధ్య‌త‌ రాష్ట్రాల‌పైనే ఉంటుంది. ఏటా ఇప్ప‌టికే స్కాల‌ర్‌షిప్ పొందుతున్న వారితోపాటు కొత్త‌వారికి ఈ అవ‌కాశం ల‌భిస్తుంది. 

ఎంత ఇస్తారు?

విద్యాస్థాయిని బట్టి స్కాల‌ర్‌షిప్‌ అందిస్తారు. ఈ మేరకు కేటగిరీలుగా విభజించారు. 

ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలి?

అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.  చివ‌రి తేదీ జూన్ 30, 2021. 

గుర్తింపు పొందిన విద్యాసంస్థ‌ల అభ్యర్థులకే...

విద్యార్థులు చేరే సంస్థ‌లకు ప్రభుత్వ గుర్తింపు కచ్చితంగా ఉండాలి. అన్ని విద్యాసంస్థ‌ల‌కు ఈ స్కీమ్ వ‌ర్తించ‌దు. ఇన్‌స్టిట్యూష‌న్లు/ కళాశాల‌లు ఏఐఎస్‌హెచ్ఈ/యూడీఐఎస్ఈ కోడ్ క‌లిగి ఉండాలి. అలాగే ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు న్యాక్‌/ఎన్‌బీఏ గుర్తింపు త‌ప్ప‌నిస‌రి. ఆయా విద్యాసంస్థ‌లు పాటించే ఆధార్ బేస్డ్ అటెండెన్స్ ప్రాతిపదికగా విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్ లు ఇస్తారు. 

వెబ్‌సైట్‌: http://socialjustice.nic.in/
 

Posted Date: 04-06-2021


 

తాజా కథనాలు

మరిన్ని