• facebook
  • whatsapp
  • telegram

ప్రాంగణ నియామకాల్లో నెగ్గాలంటే..!

విద్యార్థులు అకడెమిక్‌ జీవితం ముగించి వాస్తవిక ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఉద్యోగజీవితంతో మొదలవుతుంది. ప్రాంగణ నియామకాలు ఈ కొత్త జీవితానికి నాంది పలికే వేదిక. వీటిలో పాల్గొనడం ఒత్తిడితో కూడుకున్న పని. తమతోపాటు చదువుకున్నవారితో ఈ పోటీలో పాల్గొనాల్సివుంటుంది. దీనిలో నెగ్గడానికి ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం! 

ప్రాంగణ నియామకాల ప్రక్రియను ఒక్కో సంస్థ ఒక్కో విధంగా నిర్వహించవచ్చు. విద్యార్థి చదివే కళాశాలలోని ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఏ స్థాయి సంస్థలను ఆకర్షించి ప్రాంగణ నియామకాలకు తీసుకురాగలదన్నది కాలేజీ పేరుప్రతిష్టలను బట్టి ఉంటుంది. విద్యార్థులు ఎంపికవ్వడంలో ప్లేస్‌మెంట్‌ సెల్‌ కృషి, సంసిద్ధత మొదలైనవీ ముఖ్యపాత్ర వహిస్తాయి.

చొరవ చూపాలి

కళాశాలలో సమర్థ అధ్యాపక బృందం, కళాశాల దార్శనికత, నాయకత్వ సంబంధిత అంశాలు విద్యార్థుల పరిధిలో ఉండవు. అయితే బహుళజాతి సంస్థలు, మంచిపేరున్న వ్యాపారసంస్థలు కాలేజీకి ప్రాంగణ నియామకాలకు రావడమన్నది ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుపై ఇవి ప్రభావం చూపిస్తాయి. అందుకే విద్యార్థులు తమ పరిధిలో లేని ఈ అంశాలను నియంత్రించుకుని తమను తాము ప్రొజెక్ట్‌ చేసుకోగలగాలి. కాలేజీలో కొన్ని గ్రూప్‌ కార్యక్రమాలు నిర్వహించడం, అంతర్‌ కళాశాలల పోటీ నిర్వహించి వాటిలో పాల్గొనడం, ఇతర విద్యార్థులను ప్రోత్సహిస్తూ నాయకత్వం తీసుకోవడం లాంటివి. భావసారూప్యమున్నవారి భాగస్వామ్యంతో పరిసర కళాశాలల విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ శిక్షణ నిర్వహిస్తూ ఆ శిక్షణకు ప్లేస్‌మెంట్‌ సెల్‌ నుంచి, ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి సహకారం తీసుకోవడం, శిక్షణ కార్యక్రమానికి వ్యాపార సంస్థల అధికారులను ఆహ్వానించటం చేయవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అవి విజయావకాశాలను మెరుగుపరుస్తాయి.   

నెట్‌వర్కింగ్‌  

ప్రాంగణ నియామకాలకు వచ్చేవి ఏ సంస్థలు, ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తాయి, ఏ స్థాయి ఉద్యోగులు ఇంటర్వ్యూ చేయబోతున్నారన్న విషయాలు తెలుసుకోవడం మాత్రమే నెట్‌వర్కింగ్‌ కాదు. రిక్రూటర్లు సెలక్ట్‌ చేసుకోవడానికి ఇలాంటివి సరిపోవు. మీ రెజ్యూమేలో మీ గురించి ఎలాంటి ప్రొజెక్షన్‌ ఇస్తున్నారు, వివిధ వేదికలపై మీ సామర్థ్యాలను ఎలా చూపుతున్నారు, మీ నిర్వహణ నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, నాయకత్వ లక్షణాలను ఎలా ప్రజెంట్‌ చేసుకుంటున్నారన్నవి మీ నెట్‌వర్కింగ్‌తో తెలియజెప్పి, మీ ఉనికి చాటుకోవాలి. ప్రాంగణ నియామకాలకు సిద్ధమయ్యేనాటికి అన్ని ప్రాథమిక అంశాల్లోనూ దృఢంగా ఉండటం ముఖ్యం. అకడమిక్‌గా, నైపుణ్యాలపరంగా మీకున్న లోపాలను నిరంతర ప్రక్రియగా సరిదిద్దుకోవాలి. కొంతమంది అభ్యర్థులు తమకు చాలా తెలుసని తెలియజెప్పడానికి కొన్ని పడికట్టు పదాలతోనో, ప్రామాణిక విషయాలతోనో ఇంటర్వ్యూ ప్యానెల్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇంటర్వ్యూ చేసేవారు అభ్యర్థుల్లోని అసలు సామర్థ్యాలను సునాయాసంగా గ్రహించగలరని గుర్తించాలి.

వీటిపై శ్రద్ధ వహించండి 

ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యే లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రణాళికతో సిద్ధమవ్వండి. 

మీ మేజర్‌ అంశాల సమాచారం మాత్రమే సరిపోదు. అదనంగా మరింత సమాచార సేకరణ అవసరం.

తొలి చూపులోనే.. 

అకడెమిక్‌లో, ఇతర ఎంపిక ప్రక్రియల్లో నెగ్గాక ఇంటర్వ్యూ ప్యానెల్‌ను ఎలా ఆకట్టుకుంటున్నారనేది ముఖ్యమైన అంశం. మొదటి చూపులోనే తాము ఎదురుచూస్తున్న అభ్యర్థి మీరేనన్న అభిప్రాయం సెలక్టర్లకు కల్పించగలగాలి. అదే మీ ప్రాథమిక ఉద్దేశమవ్వాలి. అది మీ ఇతర అంశాలతో పాటు వస్త్రధారణలోనూ కనిపిస్తుంది. చాలామంది అలక్ష్యం చేసే అంశాల్లో ప్రొఫెషనల్‌ వస్త్రధారణ ఒకటి.  

ప్రజెంటేషన్‌పై ఆసక్తి  

ప్రాంగణ నియామకాల్లో ఆయా సంస్థల బాధ్యులు తమ సంస్థ ప్రొడక్ట్, మార్కెటింగ్, విజన్, మిషన్‌ లాంటివి ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేస్తారు. ఈ ప్రజెంటేషన్‌పై విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపాలి. చాలా సందర్బాల్లో విద్యార్థుల ఆసక్తినీ, శ్రద్ధనూ తెలుసుకు నేందుకు ప్రజెంటేషన్‌లోని అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగవచ్చు. విద్యార్థుల పరిశీలన, అప్రమత్తత, ఆసక్తులను వెల్లడించే అంశమిది. ఇలాంటివాటిలో ముందున్న విద్యార్థులపై రిక్రూటర్లకు నమ్మకం పెరుగుతుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ క్యాంపస్‌ కొలువు కొట్టాలంటే?

‣ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమేనా?

‣ నిరుద్యోగులకు రైల్వే ఉచిత శిక్షణ

‣ మర్యాదలకూ మేనేజర్లు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 28-02-2022


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం