• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హిందీ ప్రిపరేషన్‌ ప్లాన్‌

విద్యార్థులు నూతన ప్రశ్నపత్రానికి అనుగుణంగా పాఠాలను ఎప్పటికప్పుడు సాధన చేయడం ద్వారా హిందీలో మంచి మార్కులను సాధించవచ్చు. ఏ ప్రశ్నకు ఏవిధంగా సమాధానం రాయాలో తెలుసుకోవాలి. దీనికిగానూ ఉపాధ్యాయుల సలహాలను కూడా తీసుకోవాలి. ప్రస్తుత విద్యావిధానంలో జ్ఞాపకశక్తి కంటే ఊహశక్తి, అవగాహన శక్తి, వ్యక్తీకరణ, ప్రశంసాత్మక వైఖరికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విధానంలో సరికొత్త మూల్యాంకన అంశాలను తెలుసుకుంటారు. విద్యార్థుల్లో భాషా జ్ఞానాన్ని, ఆలోచనాశక్తిని పెంపొందించే విధంగా నూతన ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. విద్యార్థులు హిందీలో ఎక్కువ మార్కులు సాధిస్తే (GPA) మార్కుల శాతం కూడా పెరుగుతుంది. హిందీ ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. దీనిలో మిగతా సబ్జెక్టుల్లా రెండు పేపర్లు ఉండవు. ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. 

మొదటి విభాగానికి 44 మార్కులను కేటాయించారు. దీనిలో శబ్దాంశాలు, వాక్యరణాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
మొదటి ప్రశ్న: తత్సమ్/తద్భవ్; వాక్యం ఇచ్చి, కింద ఇచ్చిన మూడింటిలో సరైన సమాధానాన్ని గుర్తించి, సమాధానం రాయాలి.
2వ ప్రశ్న: వాక్యాన్ని ఇచ్చి దానిలోని క్రియా విశేషణ పదాన్ని గుర్తించమని అడుగుతారు.
3వ ప్రశ్న: సంఖ్యను ఇచ్చి హిందీ అక్షరాల్లో సమాధానం రాయమంటారు.
4వ ప్రశ్న: వాక్యాల కారక్ చిహ్నాలను ఇచ్చి సరైన సమాధానాన్ని గుర్తించమంటారు.
5వ ప్రశ్న: ఒక వాక్యం ఇచ్చి దానిలో సమాస పదానికి సరైన సమాసాన్ని గుర్తించి రాయమంటారు.
6వ ప్రశ్న: వాక్యంలో గీత గీసిన పదానికి సంధి విచ్ఛేద్ రాయాలి.
7వ ప్రశ్న: ఇచ్చిన వాక్యానికి ఒక పదంలో సమాధానాన్ని రాయాలి.
8వ ప్రశ్న: ముహావర్ కీ అర్థ్ కింద ఇచ్చిన మూడింటిలో సరైన దాన్ని గుర్తించి సమాధానం రాయాలి.
9వ ప్రశ్న: ఇచ్చిన వాక్యాన్ని చదివి లింగాన్ని మార్చి రాయాలి.
10వ ప్రశ్న: వాక్యం ఏక వచనంలో ఇస్తే బహువచనంలోకి మార్చి రాయాలి
11వ ప్రశ్న: ‘కాల్’ నుంచి అడుగుతారు.
12వ ప్రశ్న: వాక్యాన్ని సరిచేసి రాయాలి.
13వ ప్రశ్న: పఠిత/అపఠిత గద్యాంశ్.. పేరాగ్రాఫ్ ఇస్తారు. దానిలో అర్థ్/ఉపసర్గ్/ప్రత్యత్/విలోమ్/సంజ్ఞ/ సర్వనామ్/క్రియా/విశేషణ్/వ్యతిరేకార్థ్లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
14వ ప్రశ్న: పఠిత గద్యాంశ్. పాఠ్యపుస్తకంలోని గద్యభాగం నుంచి ఒక పేరాను ఇస్తారు. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను ఒక పదం లేదా వాక్యరూపంలో రాయాలి.
15వ ప్రశ్న: అపఠిత గద్యాంశ్. దీనిలో 5 లేదా 6 పంక్తుల వాక్యాలను ఇస్తారు. దీని నుంచి బహుళైచ్ఛిక విధానంలో నాలుగు ప్రశ్నలను అడుగుతారు. సరైన అక్షరాన్ని గుర్తించి సమాధానపత్రంలో రాయాలి.
16వ ప్రశ్న: పఠిత పద్యాంశ్. దీనిలో పాఠ్యపుస్తకంలోని ఒక పద్యాన్ని ఇచ్చి నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయమని అడుగుతారు. వీటిని వాక్యరూపంలో రాయాలి.
17వ ప్రశ్న: అపఠిత పద్యాంశ్ ఇచ్చి నాలుగు ప్రశ్నలు అడుగుతారు. ఇవి బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. సరైన అక్షరాన్ని గుర్తించి సమాధానపత్రంలో రాయాలి. ఆధునిక హిందీ సాహిత్యంలో సరళ పద్యాలను అభ్యాసం చేస్తే నాలుగు మార్కులు సాధించవచ్చు.
18వ ప్రశ్న: విజ్ఞాపనం/కరపత్ర్/సూచన/నమూనా పత్ర్లపై నాలుగు బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. పాఠ్యపుస్తకంలోని విజ్ఞాపనాలు, కరపత్రాలు, సూచన, నమూనా పత్ర్లతోపాటు పుస్తకేతర అంశాలను కూడా చదవాలి.
19వ ప్రశ్న పద్య భాగం, 20వ ప్రశ్న గద్యభాగం నుంచి అడుగుతారు. వీటికి ఆరు వాక్యాల్లో సమాధానం రాయాలి. దీనిలో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి.

రెండో విభాగానికి 16 మార్కులు కేటాయించారు. దీనిలో 21, 22వ ప్రశ్నలు పద్యభాగం నుంచి; 23, 24, 25వ ప్రశ్నలు గద్యభాగం నుంచి; 26, 27, 28వ ప్రశ్నలు ఉపవాచకం నుంచి వస్తాయి. వీటికి రెండు లేదా మూడు వాక్యాల్లో సమాధానం రాయాలి. 
మూడో విభాగానికి (అభివ్యక్తి విభాగం) 40 మార్కులు కేటాయించారు. దీనిలో 29, 30వ ప్రశ్నలు పద్యభాగానికి చెందిన వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. వీటిలో ఒక ప్రశ్నకు జవాబు రాయాలి. దీనిలో ముఖ్యంగా బరస్ తే బాదల్, హమ్ భారత్వాసీ, కణ్కణ్కా అధికారి పాఠ్యాంశాలపై దృష్టి పెట్టాలి. 31, 32వ ప్రశ్నలు గద్యభాగానికి చెందినవి. ఇవి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. వీటిలో ఒక ప్రశ్నకు జవాబు రాయాలి. దీనిలో ముఖ్యంగా ఇద్గాహ్, లోక్గీత్, స్వరాజ్య్ కీ నీఁవ్, జల్హీ జీవన్ పాఠ్యాంశాలను చదవాలి. వీటన్నింటికీ 12 - 15 పంక్తుల్లో సమాధానాలు రాయాలి.
సృజనాత్మకత: దీనికి సంబంధించి అయిదు ప్రశ్నలు అడుగుతారు. వీటిలో మూడింటికి సమాధానాలు రాయాలి.
33వ ప్రశ్న: సంకేత శబ్దాల ఆధారంగా సమాధానం రాయాలి.


లేఖారచన
34వ ప్రశ్న ఔపచారిక్ పత్ర్, 35వ ప్రశ్న అనౌపచారిక్ పత్ర్లకు సంబంధించిన లేఖారచన అడుగుతారు. వీటిలో ఒక ప్రశ్నకు జవాబు రాయాలి. 
చుట్టీ పత్ర్, పితాజీ కో పత్ర్, మిత్ర్ కో పత్ర్లతో పాటు పాఠశాల సంచాలకుడు, పురపాలక కమిషనర్ తదితరులకు రాసే నమూనా లేఖలను సాధన చేయాలి. లేఖను ఒక పేజీలోనే పూర్తి చేయాలి. అక్షరదోషాలు లేకుండా రాస్తే ఎనిమిది మార్కులు ఇస్తారు. ఎడమవైపు మార్జిన్ లేకుండా రాస్తే ఒకమార్కు కోల్పోతారు.

మార్కుల విభజన
స్థాన్ - 1/2
దినాంక్ - 1/2
బేజ్నే వాలేకా పతా కే లియే - 1
సంబోధన్ కే లియే - 1/2
విషయ్ వస్తు కే లియే - 3
సమాప్తి - 1
పాన్ వాలేకా పతా - 1
భాషా, శైలి - 1/2

నిబంధ్
36, 37వ ప్రశ్నలు నిబంధ్కు సంబంధించినవి. ఇవి పాఠ్యపుస్తకంలో లేని సాధారణ అంశాలు కాబట్టి విద్యార్థి ఇందులో ఎక్కువ మార్కులను పొందవచ్చు. నిబంధ్ విషయంలో చాలా తక్కువ రాయడం లేదా వదిలేయడం వల్ల మార్కులు నష్టపోతారు. విద్యార్థులు మాతృభాషలో ఆలోచించి దాన్ని హిందీలోకి తర్జుమా చేస్తూ ఇచ్చిన అంశాన్ని సులభంగా రాయవచ్చు. ఇచ్చిన రెండింటిలో ఏ అంశం గురించి మీరు బాగా రాయగలమని అనుకుంటారో దాన్నే ఎంచుకోవాలి. కనీసం మూడు పేరాగ్రాఫ్లు రాయాలి. వాక్య నిర్మాణ క్రమాన్ని అనుసరిస్తూ సమాధానం రాయాలి. సమాధానంలో విషయం బాగుండాలి. నూతనత్వం ఉండేలా ఆలోచించి మంచి పదజాలాన్ని ఉపయోగించాలి. వాటిలో రాష్ట్రీయ త్యోహార్, పర్యావరణ్ ఔర్ ప్రదూషణ్, బేటి బచావో బేటి పఢావో, ప్రియనేత, స్వచ్ఛభారత్, ప్రగతిశీల్ భారత్ మే కృత్రిమ్ ఉపగ్రహ్ లాంటివి ముఖ్యమైనవి.

మార్కుల విభజన
భూమికా - 1
విషయ్ ప్రవేశ్ - 1
విషయ్ విశ్లేషణ్ - 4
ఉప సంహార్ - 1
భాషా, శైలి - 1

రచయిత: బొల్లు రామమోహన్

Posted Date : 21-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం