హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11.30 గంటలకు హైదరాబాలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మే 23 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన 5,09,275 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను pratibha.eenadu.net/eenadupratibha.net www.bse.telangana.gov.in లో చూడవచ్చు.