ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నల్లో నాలుగు లేదా ఐదు పదాలు గానీ సంఖ్యలు గానీ అక్షరాల సమూహాలు గానీ ఇస్తారు. వాటిలో ఒకదానిలో తప్ప, మిగతా అన్నింటిలో ఒక సహజ లక్షణం ఉంటుంది. ఆ సహజ లక్షణం లేనిదే భిన్నమైందిగా భావించాలి. ఇచ్చిన వాటిలో ఏవేవి పోలికను కలిగి ఉన్నాయి, ఏవి విభేదిస్తున్నాయనేది అర్థం చేసుకోగలిగితే అభ్యర్థి సరైన జవాబును గుర్తించగలడు.
* భిన్నమైంది అంటే ప్రత్యేకమైందని కాదు, అన్నింటిలో ఉన్న సహజ లక్షణం కలిగి లేనిది అని అర్థం.
* భిన్నపరీక్ష ప్రధానంగా 3 రకాలు అవి: పద భిన్న పరీక్ష, సంఖ్య భిన్న పరీక్ష, అక్షర భిన్న పరీక్ష. అన్నింటికంటే పద భిన్న పరీక్ష నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు.
పద భిన్నపరీక్ష
జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన అంశాలను గానీ నిత్యజీవితంలో మన చుట్టూ ఉండే అంశాలను గానీ ప్రశ్నలుగా ఇచ్చి, భిన్నమైన దాన్ని గుర్తించడంలో అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.
1. 1) డాక్టర్ 2్శ లాయర్ 3) ఆసుపత్రి 4) ఫార్మాసిస్ట్
వివరణ: ఇచ్చిన వాటిలో లాయర్ తప్ప, మిగతావన్నీ వైద్య రంగానికి చెందినవని అనిపిస్తుంది. కానీ అది సరైన సమాధానం కాదు. డాక్టర్, లాయర్, ఫార్మాసిస్ట్ వీరందరూ వ్యక్తులు, ఆసుపత్రి అనేది ఒక సంస్థ. కాబట్టి ఆసుపత్రి భిన్నమైంది.
జవాబు: 3
2. 1) హితం 2) సలహా 3) సూచన 4) ఆదేశం
వివరణ: హితం, సలహా, సూచనలు పాటిస్తే బాగుంటుందని శ్రేయోభిలాషులు చెబుతారు. వాటిని పాటించవచ్చు లేదా వదిలేయొచ్చు. కానీ ఆదేశం వీటికి భిన్నమైంది తప్పనిసరిగా దాన్ని పాటించాల్సిందే.
జవాబు: 4
3. 1) బంగారం 2) బొగ్గు 3) వజ్రం 4) గ్రాఫైట్
వివరణ: బొగ్గు, వజ్రం, గ్రాఫైట్‌లు కార్బన్ రూపాంతరాలు, బంగారం కాదు.
జవాబు: 1
4. 1) కాండం 2) చెట్టు 3) కొమ్మలు 4) వేరు
వివరణ: కాండం, కొమ్మలు, వేరు అనేవి చెట్టులోని వివిధ భాగాలు. చెట్టు వాటిలా ఒక భాగం కాదు. (మొత్తం: విడిభాగం)
జవాబు: 2
5. 1) కాపర్ 2) జింక్ 3) ఐరన్ 4) మెర్క్యురీ
వివరణ: కాపర్, జింక్, ఐరన్‌లు ఘనరూప లోహాలు. ఒక్క మెర్క్యురీ మాత్రమే ద్రవరూప లోహం.
జవాబు: 4
6. 1) ఇనుము 2) ఇత్తడి 3) రాగి 4) బంగారం
వివరణ: ఇనుము, రాగి, బంగారం అనేవి లోహాలు. ఇత్తడి మాత్రం మిశ్రమ లోహం. అంటే సహజంగా లభించదు, కృత్రిమంగా ఇతర లోహాలతో తయారుచేస్తారు.
జవాబు: 2
7. 1) పెట్రోలు - కారు 2) ఇంకు - పెన్ను 3) చెత్త - చెత్తకుండీ 4) లెడ్ - పెన్సిల్
వివరణ: ఇచ్చిన ప్రతి జతలో రెండోది పనిచేయాలంటే మొదటిది తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే పని జరగదు. చెత్త - చెత్తకుండీకి ఇది వర్తించదు.
జవాబు: 3
8. 1) వైన్ - ద్రాక్ష 2) కాగితం - వెదురు 3) చెప్పులు - తోలు 4) గోధుమ - పంట
వివరణ: పైవాటిలో మొదటిది రెండోదాని నుంచి తయారవుతుంది. 1, 2, 3 జతల్లో ఈ నియమం వర్తిస్తుంది. కానీ గోధుమ ఒక రకమైన పంట.
జవాబు: 4
9. 1) సైన్యం - సైన్యాధికారి 2) ఓడ - కెప్టెన్ 3) బస్సు - డ్రైవర్ 4) కళాశాల - ప్రిన్సిపల్
వివరణ: మొదటిదానికి అధికారి (హెడ్) రెండో దానిలో ఉన్న వ్యక్తి. 1, 2, 4 లలో ఈ సంబంధం ఉంది. మూడోదానిలో డ్రైవర్ బస్సును నడుపుతాడు కానీ అతడు ఆ బస్సుకు అధికారి కాదు.
జవాబు: 3
10. 1) చెట్టు - కొమ్మ 2) చెయ్యి - వేలు 3) బల్ల - కుర్చీ 4) గది - నేల (ఫ్లోర్)
వివరణ: మొదటిది మొత్తం - రెండోది అందులోని ఒక భాగం. 1, 2, 4లలో ఈ సంబంధం ఉంది. మూడోదాంట్లో బల్ల, కుర్చీ వేర్వేరు.
జవాబు: 3
సంఖ్య భిన్న పరీక్ష
11. 1) 14 2) 18 3) 20 4) 22
వివరణ: ఇచ్చిన సంఖ్యల నుంచి 1 ని తీసేస్తే ప్రధానసంఖ్యలు వస్తాయి. 22 ఇందుకు భిన్నమైంది.
14 - 1 = 13; 18 - 1 = 17 20- 1 = 19; 22 - 1 = 21
జవాబు: 4
12. 1) 144 2) 245 3) 386 4) 567
వివరణ: వరుస సంఖ్యల ఘాతాల మొత్తం కింది విధంగా పరిశీలించగా 1, 2, 4 లలో ఉన్న సంబంధం 3 లో లేదు.
జవాబు: 3
13. 1) 52 2) 56 3) 48 4) 64
వివరణ: సంఖ్యలోని అంకెలను కూడితే 2, 3, 4 లలో 2 అంకెల సంఖ్యలు వస్తే, 1వ దానిలోని అంకెలను కూడితే ఒక అంకె వచ్చింది.
జవాబు: 1
14. 1) 35 2) 45 3) 60 4) 80
వివరణ: 2, 3, 4 లలోని సంఖ్యలు 5 తో సంయుక్త సంఖ్యల లబ్ధాల విలువలు. కానీ ఒకటోదానిలోని సంఖ్య 5 తో ప్రధాన సంఖ్య లబ్ధం.
(9, 12, 16లు సంయుక్త సంఖ్యలు, 7 ప్రధాన సంఖ్య)
జవాబు: 1
15. 1) 93 2) 69 3) 34 4) 42
వివరణ: 1, 2, 3లలో ఉన్నవి రెండంకెల ప్రధాన సంఖ్యల గుణిజాలు. నాలుగులో ఉన్న 42లో మాత్రం అలాకాదు.
( 31, 23, 17లు రెండంకెల ప్రధాన సంఖ్యలు, 21 సంయుక్త సంఖ్య)
జవాబు: 4
16. 1) 131 2) 151 3) 171 4) 181
వివరణ: సంఖ్యల్లోని అంకెలను కూడగా బేసి సంఖ్యలు వస్తాయి. ఒక 4 వ ఆప్షన్‌లో తప్ప.
జవాబు: 4
17. 1) 3759 2) 2936 3) 6927 4) 5814
వివరణ: ఆప్షన్లు 1, 3, 4 ల్లో సంఖ్యలోని 1, 3వ స్థానాల్లోని అంకెల మొత్తం కంటే 2, 4వ స్థానాల్లోని అంకెల మొత్తం రెండు రెట్లుగా ఉంది.
జవాబు: 2
18. 1) 56 2) 63 3) 112 4)
* వివరణ: ఇచ్చిన సంఖ్యలను 7 తో భాగించగా కచ్చితమైన వర్గం వస్తుంది. 1వ ఆప్షన్‌లో తప్ప.
జవాబు: 1
19. 1) 392 2) 326 3) 414 4) 248
వివరణ: సంఖ్యలోని అంకెలన్నింటి లబ్ధం విలువ ఒక కచ్చితమైన వర్గం అవుతుంది. ఆప్షన్ 1లో మాత్రం కాదు.
20. 1) 1(5)2 2) 7(113) 8 3) 3 (17) 4 4) 5 (61) 6
వివరణ: బ్రాకెట్‌లో ఉన్న సంఖ్యకు ముందు, వెనకాల ఉన్న అంకెల వర్గాల మొత్తం, బ్రాకెట్‌లో ఉన్న విలువకు సమానం.
జవాబు: 3
21. 1) 16 - 18 2) 56 - 63 3) 96 - 108 4) 86 - 99
వివరణ: అన్నింటిలో మొదటి, రెండో విలువల నిష్పత్తి 8 : 9 రూపంలో ఉన్నాయి. ఒక్క 4వ ఆప్షన్‌లో తప్ప
జవాబు: 4
22. 1) 140 - 45 2) 110 - 35 3) 100 - 30 4) 80 - 25
వివరణ: మొదటి సంఖ్య నుంచి 5ను తీసేసి 3 తో భాగిస్తే రెండో సంఖ్య వస్తుంది. 3వ ఆప్షన్‌లో తప్ప.
జవాబు: 3
అక్షర భిన్న పరీక్ష
1. 1) UQ 2) JG 3)RN 4) NJ
వివరణ: అక్షరాల మధ్య 4 స్థానాల దూరం ఉంది, 2వ దానిలో తప్ప.
జవాబు: 2
2. 1) AEFJ 2) KOPT 3) UYZD 4) EHIL
వివరణ:
జవాబు: 4
3. 1) QRST 2) BECD 3)FIGH 4) LOMN
వివరణ: 2, 3, 4లలో ఒక అచ్చు ఉంది. కానీ 1వ ఆప్షన్‌లో అచ్చు లేదు.
జవాబు: 1
4. 1) BDFH 2) MOQS 3) SUWY 4) TVZE
వివరణ:
జవాబు: 4
ఇచ్చిన పదాలు లేదా అక్షరాల్లో ఒకటి మాత్రమే భిన్నంగా ఉంటుంది. అదే కావాల్సిన సమాధానం.
1. ఎ) ZW బి) TQ సి) SP డి) NL
జ: NL
వివరణ:
ఆల్ఫాబెటిక్ అక్షరాల విలువలను నేర్చుకుంటే, ఈ విభాగంలోని ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
A B C D E F G H I J K L M
Z Y X W V U T S R Q P O N
26 25 24 23 22 21 20 19 18 17 16 15 14
దీంట్లో ముందు అక్షరం విలువ నుంచి 3 తీసేస్తే తర్వాత అక్షరం వస్తుంది. కానీ, NL లో భేదం 2 (14-12) గా ఉంది. కాబట్టి ఇది భిన్నమైంది.
2. ఎ) CFD బి) GJH సి) KNM డి) JNK
జ: KNM
వివరణ: దీంట్లో ముందు అక్షరం విలువకు 3 కలిపితే రెండో అక్షరం, రెండో అక్షరం నుంచి 2 తీసేస్తే తర్వాత అక్షరం వస్తాయి. కానీ, KNM ఈవిధంగా లేదు. కాబట్టి ఇది భిన్నమైంది.
3. ఎ) KLM బి) ABC సి) DEF డి) RST
జ: RST
వివరణ: ముందు అక్షరం విలువకు 1 కలిపితే తర్వాత అక్షరం వస్తుంది.
అన్ని అక్షరాలూ ఇదేవిధంగా అమరి ఉన్నాయి. కానీ, పైన ఇచ్చిన టేబుల్‌ను గమనిస్తే RST అనే అక్షరాలు రెండో సగభాగంలో ఉన్నాయి.
4. ఎ) BD బి) CI సి) DP డి) EV
జ: EV
వివరణ: ఈ అమరికలో ముందు అక్షరం విలువను వర్గం చేస్తే రెండో అక్షరం వస్తుంది. కానీ,
EV లో E 5
5 × 5 = 25 = Y . రెండో అక్షరం Y ఉండాలి.
కాబట్టి ఇది భిన్నమైంది.
5. ఎ) AA బి) BB సి) EEEEE డి) DDDD
జ: AA
వివరణ: వీటిలో AA కాకుండా మిగిలినవాటిలో అక్షరం విలువ ఎంత ఉందో ఆ అక్షరాన్ని అన్నిసార్లు రాశారు.
6. ఎ) BO బి) AN సి) DW డి) CP
జ: DW
వివరణ: మొదటి, రెండో అక్షరాల మధ్య వ్యత్యాసం 13 ఉంది. కానీ, DW లో భేదం 19 (23 - 4) ఉంది. కాబట్టి DW భిన్నమైంది.
7. ఎ) ABC బి) BCD సి) CDE డి) DEF
జ: BCD
వివరణ: అన్ని అమరికల్లోని అక్షరాల విలువలు క్రమంగా పెరిగాయి. Vowles ఆధారంగా చూస్తే BCD లో vowel లేదు. కాబట్టి ఇది భిన్నమైంది.
8. ఎ) PRT బి) MOQ సి) GEC డి) TVX
జ: GEC
వివరణ: ఈ అమరికలో ప్రతి ముందు అక్షరానికి 2 కలిపితే తర్వాత అక్షరం వస్తుంది. కానీ, GEC లో 2 తీసేశారు. కాబట్టి భిన్నమైంది GEC .
9. ఎ) LO బి) MN సి) GT డి) FV
జ: FV
వివరణ: టేబుల్‌ను గమనిస్తే, ప్రతి జత అక్షరాల్లో మొదటిదానికి రెండోది వ్యతిరేక స్థానం ఉంది.
వ్యతిరేకంగా
L O
M N
G T
F U కానీ, దీని స్థానంలో V ఉంది. కాబట్టి ఇది భిన్నమైంది.
10. ఎ) QT : RS బి) LP : MO సి) BG : CF డి) VZ : XY
జ: VZ : XY
వివరణ: మొదటి అక్షరాల జతలోని ముందు అక్షరానికి 1 కలిపి, రెండో అక్షరం నుంచి 1 తీసేస్తే రెండో జత వస్తుంది. కానీ, VZ : YZ లో ఈవిధంగా లేదు.
కాబట్టి ఇది భిన్నమైంది.
11. ఎ) LMN బి) LKJ సి) UTS డి) FED
జ: LMN
వివరణ: LMN లో అక్షరాల విలువలు పెరిగే క్రమంలో ఉండగా, LKJ, UTS, FED ల్లో తగ్గే క్రమంలో ఉన్నాయి. కాబట్టి భిన్నమైంది LMN.
12. ఎ) Shirt - Dress బి) Boy - Girl సి) Mango - Fruit డి) Table - furniture
జ: Boy - Girl
వివరణ: ఇచ్చిన పదాల జతల్లో రెండోది, మొదటి పదంలో భాగంగా ఉంది.
Shirt అనేది Dress లో భాగం.
Mango అనేది Fruit లో భాగం.
Table అనేది Furniture లో భాగం.
Boy, Girl అనేవి రెండూ భిన్నమైన పదాలు.
13. ఎ) SORE బి) SOTLU సి) NORGAE డి) MEJNIAS
జ: NORGAE
వివరణ: ప్రతి పదంలోని అక్షరాలను ఒక క్రమంలో రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి.
Sore Rose
Sotlu Lotus
Norgae Orange
Mejnias Jasmine
Orange తప్ప మిగిలినవన్నీ పుష్పాలు. కాబట్టి భిన్నమైంది Orange.
14. ఎ) JOT బి) OUT సి) FED డి) DIN
జ: OUT
వివరణ: అన్ని పదాల్లో ఒక Vowel మాత్రమే ఉంది. కానీ, Out లో రెండు vowles ఉన్నాయి. కాబట్టి భిన్నమైంది ఇదే అవుతుంది.
15. ఎ) PUT బి) END సి) OWL డి) ARM
జ: PUT
వివరణ: ఆప్షన్లలో ఇచ్చిన ప్రతి పదం Vowlelతో ప్రారంభమైంది. Put మాత్రమే ఈవిధంగా లేదు. కాబట్టి భిన్నమైంది ఇదే.
16. ఎ) EBD బి) IFH సి) QNO డి) YVX
జ: QNO
వివరణ: ఇచ్చిన పదాల్లోని మొదటి, చివరి స్థానాల్లో వరుస అక్షరాలు ఉన్నాయి.
EBD D,E
IFH H,I
QNO O,Q
YVX XY
QNO లో O తర్వాత P ఉండాలి. కానీ, Q ఉంది. కాబట్టి ఇది భిన్నమైంది.
17. ఎ) RNJ బి) XTP సి) MIE డి) ZWR
జ: ZWR
వివరణ: దీంట్లో ప్రతి పదంలోని ముందు అక్షరం విలువ నుంచి 4 తీసేస్తే తర్వాత అక్షరాలు వస్తాయి.
18 14 10 -4 -4
R N J R N J
24 20 16 -4 -4
X T P X T P
13 9 5 -4 -4
M I E M I E
26 23 18 -3 -5
Z W R Z W R
ZWR లో ఈవిధంగా లేదు. కాబట్టి ఇది భిన్నమైంది.
18. ఎ) ABCD బి) EGIK సి) ACDF డి) CFIL
జ: ACDF
వివరణ: ఇచ్చిన ఆప్షన్లలో ప్రతి అమరికలోని ముందు పదాల విలువకు ఒక స్థిర సంఖ్యను కలిపితే తర్వాత అక్షరాలు వస్తున్నాయి. కానీ, ACDF ఈ క్రమంలో లేదు. కాబట్టి ఇది భిన్నమైంది.
+1 +1 +1 +2 +2 +2
A B C D ; E G I K ;
+2 +1 +2 +3 +3 +3
A C D F ; C F I L
19. ఎ) xXYA బి) iLMP సి) hHIK డి) bBCE
జ: iLMP
వివరణ: ప్రతి పదంలోని మొదటి అక్షరాన్ని చిన్నది (small letter)గా రాసి, తర్వాత వెంటనే అదే అక్షరాన్ని పెద్ద అక్షరం (capital letter)గా రాశారు. కానీ, iLMP లో ఈవిధంగా లేదు కాబట్టి ఇది భిన్నమైంది.
xXYA, iLMP, hHIK, bBCE
20. ఎ) PENAL బి) IDHNI సి) RUUD డి) KRTSINSA
జ: PENAL
వివరణ: ప్రతి ఆప్షన్‌లోని అక్షరాలను ఒక క్రమంలో రాస్తే కొన్ని భాషల పేర్లు వస్తాయి. కానీ, PENAL లోని పదాలతో ఏ భాష పేరు రాదు. కాబట్టి ఇది భిన్నమైంది.
బి) IDHNI HINDI
సి) RUUD URDU
డి) KRTSINSA SANSKRIT
ఎ) PENAL ?
21. ఎ) HSIRJ బి) FIGSH సి) DWEVF డి) AZBYC
జ: FIGSH
వివరణ: ప్రతి పదంలోని మొదటి, మూడు, అయిదో అక్షరాలు వరుసగా వాటి విలువలు పెరిగే క్రమంలోనూ, రెండు, నాలుగో అక్షరాలు వాటి ముందు అక్షరానికి వ్యతిరేకంగానూ (బాక్సు ప్రకారం) ఉన్నాయి.
H S I R J H, I, J
H వ్యతిరేకం S;
I వ్యతిరేకం R
F T G S H F, G, H
F వ్యతిరేకం U;
G వ్యతిరేకం S
D W E V F D, E, F
D వ్యతిరేకం W;
E వ్యతిరేకం V
A Z B Y C A, B, C
A వ్యతిరేకం Z;
B వ్యతిరేకం Y
FTGSH లో T స్థానంలో U ఉండాలి. కాబట్టి ఇది భిన్నమైంది.
22. ఎ) EFGIK బి) CDFIM సి) BCEHL డి) ABDGK
జ: EFGIK
వివరణ: ప్రతి పదంలోని ముందు అక్షరం విలువకు వరుసగా 1, 2, 3, 4 లను కలిపితే తర్వాత అక్షరాలు వస్తాయి.
+ 1 +2 +3 +4
బి) C D F I M
+ 1 +2 +3 +4
సి) B C E H L
+ 1 +2 +3 +4
డి) A B D G K
+ 1 +1 +2 +2
ఎ) E F G I K భిన్నమైంది.
23. ఎ) H బి) Q సి) T డి) Z
జ: Q
వివరణ: ప్రతి అక్షరాల విలువలను గమనిస్తే (బాక్సు ప్రకారం) H = 8; Q = 17; T = 20; Z = 26 వీటిలో Q తప్ప మిగిలిన అక్షరాల విలువలన్నీ సరి సంఖ్యలు. కాబట్టి భిన్నమైంది Q.
24. ఎ) A బి) E సి) I డి) U
జ: U
వివరణ: అన్నీ vowles ఇచ్చారు. కానీ U అనేది రెండో సగ భాగంలో (బాక్సును గమనించండి) ఉంది. కాబట్టి భిన్నమైంది U.
25. ఎ) RSDNM బి) JIBWU సి) QPBDE డి) LKSZY
జ: JIBWU
వివరణ: ఇచ్చిన పదాల్లో మధ్య అక్షరాన్ని మినహాయిస్తే, మిగిలిన రెండు జతల్లో వరుస అక్షరాలు ఉన్నాయి.
ఎ) RSDNM RS D NM
బి) JIBWC JI B WC వరుస అక్షరాలు కావు.
సి) QPBDE QP B DE
డి) LKSZY LK S ZY
26. ఎ) DGLS బి) WZEL సి) JMRY డి) SUXB
జ: SUXB
వివరణ: ప్రతి పదంలో ముందు అక్షరం విలువలకు వరుసగా 3, 5, 7 కలిపితే తర్వాత అక్షరాలు వస్తున్నాయి.
+3 +5 +7 +3 +5 +7
D G L S W Z E L ;
+3 +5 +7
J M R Y
+2 +3 +5
S U X B (దీంట్లో X స్థానంలో Y ఉండాలి. కాబట్టి ఇది భిన్నమైంది).