• facebook
  • whatsapp
  • telegram

అంతస్స్రావ్య వ్యవస్థ

మాదిరి ప్రశ్నలు

 

1. వాసోప్రెసిన్‌ లోపం వల్ల మానవుల్లో కలిగే లోప లక్షణం ఏది?

1) డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌ 

2) డయాబెటిస్‌ మెల్లిటస్‌ 

3) డయాబెటిస్‌ మాల్కోవా 

4) డయాబెటిస్‌ డ్రిమియా 

 

2. యాంటీడైయూరెటిక్‌ హార్మోన్‌కు మరోపేరు?

1) థైరాక్సిన్‌                         2) వాసోప్రెసిన్‌ 

3) పారాథార్మోన్‌                    4) ఇన్సులిన్‌ 

 

3. కిందివాటిలో డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌ వ్యాధి లక్షణాలు ఏవి?

i. అధిక మూత్రోత్పత్తి                 ii. తీవ్రదాహం 

iii. అధిక నీటి విసర్జన

1) i, ii               2) i, iii               3) ii, iii             4) i, ii, iii

 

4. పూర్వ పిట్యూటరీ లేదా ఎడినో హైపోఫైసిస్‌ స్రవించే పెరుగుదల హార్మోన్‌ అధికోత్పత్తి వల్ల ప్రౌఢ మానవుడి ముఖ స్వరూపంలో కలిగే అసాధారణ లక్షణం?

1) ఆక్రోమెగాలి                    2) టెటాని  

3) క్రెటెనిజం                      4) మెగలోసెఫాలి 

 

5. ఏ హార్మోన్‌ అధిక ఉత్పత్తి అతికాయత లేదా మహాకాయత అనే పరిస్థితికి కారణమవుతుంది?

1) థైరాక్సిన్‌ 

2) మానవ పెరుగుదల హార్మోన్‌ 

3) పారాథార్మోన్‌                        4) అడ్రినలిన్‌ 

 

6. గాయిటర్‌ వ్యాధికి సంబంధించిన హార్మోన్‌ ఏది?

1) ఆక్సిటోసిన్‌ 

2) మానవ పెరుగుదల హార్మోన్‌ 

3) థైరాక్సిన్‌                4) అడ్రినలిన్‌  

 

7. మానవుల్లో మరుగుజ్జుతనం కలగడానికి కారణం ఏమిటి?

1) మానవ పెరుగదల హార్మోన్‌ అధికంగా విడుదలవడం

2) మానవ పెరుగుదల హార్మోన్‌ అల్పంగా ఉత్పత్తి కావడం

3) థైరాయిడ్‌ గ్రంథి వాపు  

4) హైపోథైరాయిడిజం

 

8. ఎడ్రినల్‌ వల్కలం స్రవించే కార్టిసాల్‌ లాంటి గ్లూకోకార్టికాయిడ్‌లు తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కలిగే వ్యాధి....

1) అడిసన్స్‌ వ్యాధి              2) కుషింగ్స్‌ సిండ్రోం

3) గౌట్‌ వ్యాధి                      4) క్లైనిఫెల్టర్‌ సిండ్రోం

 

9. కుషింగ్స్‌ సిండ్రోం దేని వల్ల సంభవిస్తుంది?

1) గ్లూకోకార్టికాయిడ్‌ల అధిక ఉత్పత్తి వల్ల

2) గ్లూకోకార్టికాయిడ్‌ల అల్ప ఉత్పత్తి వల్ల

3) 21వ క్రోమోజోమ్‌లో సంభవించే అపస్థితి వల్ల

4) 28వ క్రోమోజోమ్‌ ఏర్పడటం వల్ల

 

10. ఇన్సులిన్‌ షాక్‌ అంటే......

1) ఇన్సులిన్‌ అల్పోత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి తగ్గడం.

2) ఇన్సులిన్‌ అధికోత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరగడం.

3) ఇన్సులిన్‌ అధికోత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి తగ్గడం.

4) మూత్ర విసర్జన జరగకపోవడం వల్ల కలిగే ప్రాణహాని.

 

11. మూత్రపిండంలో ఉండే రక్తనాళికా గుచ్ఛసన్నిధి పరికరం ఏ హార్మోన్‌ను స్రవిస్తుంది?

1) సెక్రిటిన్‌                    2) ఎరిత్రోపాయిటిన్‌    

3) కార్టిసాల్‌                    4) ఎడ్రినలిన్‌

 

12. కొన్ని అంతస్స్రావక గ్రంథులు కాని కణజాలాలు లేదా అవయవాలు హార్మోన్‌లను స్రవిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి కిందివాటిలో ఏవి?

i) మూత్రపిండం                ii) హృదయం 

iii) జఠరాంత్ర నాళం

1) i, ii                       2) ii, iii                  3) i, iii                 4) i, ii, iii

 

13. గాస్ట్రిన్, సెక్రిటిన్, కొలిసిస్టోకైనిన్, జఠర నిరోధక పెప్టైడ్‌ లాంటి హార్మోన్‌లను స్రవించి జీర్ణరసాల స్రావాన్ని క్రమబద్ధం చేయడంలో సాయపడేవి ఏవి?

1) జఠరాంత్రనాళపు శ్లేష్మస్తర కణాలు     

2) మూత్రపిండాలు

3) హృదయకర్ణిక కుడ్యం     

4) క్లోమం

 

14. జఠర గ్రంథులపై ప్రభావం చూపి, హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, పెప్సినోజిన్‌ విడుదలను ప్రేరేపించే హార్మోన్‌ ఏది?

1) గాస్ట్రిన్‌                     2) సెక్రిటిన్‌ 

3) ఇన్సులిన్‌              4) పెప్సిన్‌

 

సమాధానాలు

1 - 1             2 - 2             3 - 4              4 - 1           5 - 2          6 - 3          7 - 2         8 - 1         9 - 1         10 - 3          11 - 2           12 - 4         13 - 1         14 - 1

 

Posted Date : 27-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌