• facebook
  • whatsapp
  • telegram

ఆవృత బీజాలు: లైంగిక ప్రత్యుత్పత్తి

1. ఆవృత బీజ మొక్కల్లో ప్రత్యుత్పత్తి అవయవాలను కలిగి ఉండే భాగం...

1) పుష్పం   2) శాకీయ మొగ్గ    3) వేరు బుడిపెలు    4) పత్రపీఠ భాగం


2. పుష్పంలో అనావశ్యక భాగాలుగా వేటిని పేర్కొంటారు?

ఎ) కేసరాలు      బి) అండకోశం      సి) రక్షక పత్రాలు     డి) ఆకర్షణ పత్రాలు

1) ఎ, బి      2)  సి, డి      3) ఎ, సి    4) బి, డి


3. పుష్పంలో ఆవశ్యక భాగాలుగా వేటిని పేర్కొంటారు?

ఎ) కేసరాలు      బి) అండకోశం       సి) రక్షక పత్రాలు   డి) ఆకర్షణ పత్రాలు

1) ఎ, బి      2) సి, డి      3) ఎ, సి    4) బి, డి


4. పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం అని దేన్ని అంటారు?

1) రక్షక పత్రాలు   2) ఆకర్షణ పత్రాలు   3) కేసరాలు     4) అండకోశం


5. సంపూర్ణ పుష్పం అంటే...

1) గుండ్రని ఆకారంలో అందంగా ఉండే పుష్పం

2)  స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు మాత్రమే కలిగి ఫలాలను ఇచ్చే పుష్పం

3) స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఎక్కువగా ఉండే పుష్పం

 4)  రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశం భాగాలన్నింటినీ కలిగిన పుష్పం

 

6. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అని దేన్ని పిలుస్తారు?

1) అండకోశం    2) కేసరాలు     3) రక్షక పత్రాలు     4) ఆకర్షణ పత్రాలు


7. ఏకలింగ పుష్పాలు అంటే ఏమిటి?

1) ఒకే కేసరం, ఒకే అండకోశం కలిగిన పుష్పాలు

 2) లింగాకారంలో ఉన్న కేసరాలు అండకోశంపై అమరి ఉండే పుష్పాలు

3) కేసరాలు లేదా అండకోశం లేదా ఏదో ఒక ప్రత్యుత్పత్తి అవయవం మాత్రమే కలిగి ఉన్న పుష్పాలు

 4) కొన్ని పుష్పాలు లింగాకారంలో కనిపిస్తాయి. వీటినే ఏకలింగ పుష్పాలు అంటారు


8. ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ?

1)  ఉమ్మెత్త       2) మందార   3) బొప్పాయి    4) చిక్కుడు


9. కేసరాలు, అండకోశం రెండింటినీ కలిగి ఉండే పుష్పాలను ఏమంటారు?

1)   ద్విరూప పుష్పాలు    2) ద్విధృవ పుష్పాలు    3)   ద్విలింగ పుష్పాలు    4) ద్విసర్పిల పుష్పాలు


10. కింది వాటిలో ద్విలింగ పుష్పాలకు ఉదాహరణలు?

ఎ) బొప్పాయి     బి) సొరకాయ      సి) ఉమ్మెత్త        డి) వంకాయ

1)  ఎ, బి    2) సి, డి       3) ఎ, బి, సి     4) ఎ, సి, డి


11. పుష్పాల్లో పురుష బీజకణాలు ఏర్పడే ప్రదేశం ఏది?

1) అండాలు    2) అండన్యాస స్థానం     3)  కేసర దండం    4) పరాగ కోశం


12. పురుష బీజకణాలు ఆవృత బీజాల్లో ఏ రూపంలో ఉంటాయి?

1)  అండాలు     2)  అండాంతర కణజాలం     3)   పరాగ రేణువులు      4)విత్తనాలు


13. ఆవృత బీజాల్లో స్త్రీ బీజ కణాలు ఎక్కడ ఏర్పడతాయి?

1) అండాలు      2)  అండన్యాస స్థానం    3) పరాగ రేణువులు     4) విత్తనం


14. కీలం, కీలాగ్రం లాంటివి పుష్పాల్లో ఏ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు?

1)  పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ     2)  స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ   3)  స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ    4) విత్తనంలో పిండకోశం


15. ఆవృత బీజ మొక్కల్లో స్త్రీ, పురుష బీజకణాలు వరుసగా ఏ స్థితిలో ఉంటాయి?

1)  ఏకస్థితికం, ఏకస్థితికం        2)  ఏకస్థితికం, ద్వయస్థితికం

3) ద్వయస్థితికం, ఏకస్థితికం    4) ద్వయస్థితికం,ద్వయస్థితికం


16. ఫలదీకరణ సమయంలో స్త్రీ, పురుష బీజకణాలు కలవడంతో ఏర్పడే సంకలిత కణం?

1)  సంయోగ బీజం   2) సంయుక్త బీజం    3)  వియుక్త బీజం   4)  విత్తనం


17. బఠాణీ లాంటి మొక్కల్లో ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పం కీలాగ్రాన్ని చేరతాయి. ఈ ప్రక్రియకు ఉన్న పేరు?

1) పరపరాగ సంపర్కం      2) పరిధీయ పరాగ సంపర్కం  3)   స్వపరాగ సంపర్కం      4)  స్వతంత్ర పరాగ సంపర్కం


18. ఒక జాతి పుష్పంలోని పురుష బీజకణాలు అదేజాతికి చెందిన ఇతర మొక్కలు లేదా అదే మొక్కలోని స్త్రీ బీజకణాలతో ఫలదీకరణం చెందడాన్ని ఏమంటారు?

1)  స్వపరాగ సంపర్కం     2)  స్వతంత్ర పరాగ సంపర్కం     3) స్వేచ్ఛా ఫలదీకరణం      4)   ఏకపరాగ సంపర్కం


19. సంయుక్త బీజం కేంద్రక స్థితి ఏమిటి?

1)  ఏకస్థితికం (n)    2)  ద్వయస్థితికం (2n)     3)  త్రయస్థితికం (3n)      4)  బహుకేంద్రక స్థితి


20. ఆవృత బీజ మొక్కల్లో పరాగనాళం ఏర్పడే దశ?

1)  పరాగ సంపర్కం తర్వాత, ఫలదీకరణానికి ముందు      2)  పరాగ సంపర్కానికి ముందు

3) ఫలదీకరణం తర్వాత       4)  పరాగ సంపర్కానికి ముందు, ఫలదీకరణానికి తర్వాత


21. పరాగనాళం ఏర్పడిన తర్వాత దశలో పరాగరేణువు ఎన్ని పురుష బీజకేంద్రకాలను కలిగి ఉంటుంది?

1)  1      2) 2     3) 3     4)  4


22. పుష్పించే మొక్కల్లో పిండకోశం ఎన్ని కణాలతో నిర్మితమై ఉంటుంది?

1) 4     2)  5       3) 6     4)  7


23.  ఏడు కేంద్రకాలతో నిర్మితమైన పిండకోశంలో ఎన్ని కేంద్రకాలు ఉంటాయి?

1)  6      2) 7      3)  8   4) 9


24. కింది ఏయే కణాలు పుష్పించే మొక్కల పిండకోశంలో ఉంటాయి?

ఎ) ప్రతిపాద కణాలు  బి) సహాయ కణాలు    సి) స్త్రీ బీజకణం      డి) మధ్యస్థ కణం (సెంట్రల్‌ సెల్‌)

1) ఎ, బి    2)  బి, సి   3) ఎ, బి, సి    4) పైవన్నీ


25. కింది వాటిలో సరైంది ఏది?

1)  పుష్పం రూపాంతరం చెందిన కాండం భాగం     2) పుష్పం రూపాంతరం చెందిన వేరు భాగం

3)  పుష్పం రూపాంతరం చెందిన పత్ర పుచ్ఛం       4) పుష్పం రూపాంతరం చెందిన మూలకేశం


26. కింది వాటిలో అంకురచ్ఛదం దేని నుంచి ఏర్పడుతుంది?

1) ద్వితీయ కేంద్రకం        2) ప్రతిపాదిత కణాలు     3) స్త్రీ బీజకణం    4) సహాయ కణాలు


27. అంకురచ్ఛదం ఆవృత బీజాల్లో ఏ స్థితిలో ఉంటుంది?

1)  ఏకస్థితికం      2) ద్వయస్థితికం    3) త్రయస్థితికం     4) పంచస్థితికం


28. రెండుసార్లు ఫలదీకరణం చెందడం (ద్విఫలదీకరణం) అనేది కింది ఏ మొక్కల ప్రత్యేక లక్షణం?

1) శైవలాలు     2) బ్రయోఫైట్‌      3)  వివృత బీజాలు    4)  ఆవృత బీజాలు


29. కింది వాటిలో స్త్రీ బీజ పరికరంలో ఉండే కణాలు?

1) స్త్రీ బీజకణం, సహాయ కణాలు     2)  స్త్రీ బీజకణం, ప్రతిపాద కణాలు     3)  స్త్రీ బీజకణం, మధ్య కణం    4) సహాయ కణాలు, ప్రతిపాద కణాలు


సమాధానాలు

1-1   2-2   3-1   4-3   5-4   6-1   7-3    8-3    9-3    10-2    11-4   12-3     13-1     14-3    15-1    16-2   17-3   18-4   19-2     20-1    21-2     22-4    23-3    24-4    25-1    26-1     27-3    28-4     29-1.


మరికొన్ని...


1. సాధారణంగా పరాగ రేణువుల నుంచి పరాగనాళం ఏర్పడే స్థానం?

1)  కీలం    2) కీలాగ్రం   3)  అండాశయం   4) అండత్వచం


2. ఫలదీకరణం తర్వాత అండాలు ఏ రకంగా మారతాయి?

1)  ఫలాలు   2)  పత్రాలు    3)  బీజదళాలు    4) విత్తనాలు


3. ఫలదీకరణం తర్వాత ఆవృత బీజ మొక్కల్లో కింది ఏ భాగం ఫలాలుగా మార్పు చెందుతాయి?

1) అండాలు    2) అండాశయం    3) కేసరాలు   4)  అండన్యాస స్థానం


4. కొబ్బరిలో తినడానికి ఉపయోగపడే భాగం విత్తనంలో ఏ భాగంగా చెప్పవచ్చు?

1) అంకురచ్ఛదం     2)  పరిచ్ఛదం      3) బీజదళం         4) పరికవచం


5. కొన్ని మొక్కల్లో పుష్పాలు ఎల్లప్పుడూ మూసుకొని ఉండటం గమనించవచ్చు. ఇటువంటి పుష్పాలను ఏ రకం పుష్పం అంటారు?

1)  చాస్మోగామస్‌ పుష్పాలు     2)  క్లీస్టోగామస్‌ పుష్పాలు    3) చరిస్మోగామస్‌ పుష్పాలు      4) కెనడోగ్రాఫిన్‌ పుష్పాలు


6. కింది వాటిలో గాలి ద్వారా పరపరాగ సంపర్కం జరిపే మొక్కలు ఏవి?

1)  వాలిస్‌నేరియా     2) గడ్డిజాతి మొక్కలు    3)  సెరటో ఫిల్లమ్‌  4) హైడ్రిల్లా


7. ఎంటమోఫిలీ అంటే ఏమిటి?

1)   గాలి ద్వారా జరిగే పరపరాగ సంపర్కం   2) కీటకాల ద్వారా జరిగే పరపరాగ సంపర్కం     3)  పక్షుల ద్వారా జరిగే పరపరాగ సంపర్కం       4) నీటి ద్వారా జరిగే పరపరాగ సంపర్కం


8. కింది పరపరాగ సంపర్క రకాన్ని వాటికి కారణమయ్యే పరాగసంపర్క కారకాలతో జత చేయండి.

జాబితా - A            జాబితా - B

a. మాలకోఫిలీ        i)  గాలి

b. అర్నిథోఫిలీ         ii) గబ్బిలాలు

c. ఖీరాప్టెరిఫిలీ        iii) పక్షులు

d. ఎనిమోఫిలీ          v) నత్తలు

1) a- iv b- iii c - ii d - i      2) a-iii b - iv c - i d- ii     3) a-iv b - iii c - i d - ii    4) a - iii b - iv c - ii d - i

సమాధానాలు

1-2   2-4     3-3    4-1    5-2     6-2   7-2    8-1.

Posted Date : 18-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌