మాదిరి ప్రశ్నలు
1. ఒక చదరపు సెంటీమీటర్పై ఒక గ్రామ్ బరువును ఏమంటారు?
జ: మిల్లీబార్
2. సముద్రమట్టం వద్ద వాతావరణ పీడనం ఎంత?
జ: 1013.25 మిల్లీబార్
3. ప్రమాణ క్షితిజసమాంతర దూరంలో పీడనంలో వచ్చే మార్పు రేటును ఏమంటారు?
జ: పీడన ప్రవణత
4. అశ్వ అక్షాంశాలు ఏవి?
జ: 25o - 30o
5. భూమధ్యరేఖపై సూర్యకిరణాలు లంబంగా ప్రసరించే విషవత్తుల సమయం ఏది?
జ: మార్చి 21, సెప్టెంబరు 22
6. 'పాము చుట్ట' ఆకారంలో సంభవించే విక్షోభం ఏది?
జ: చక్రవాతం
7. ప్రపంచంలో సగటున ఎక్కువ చక్రవాతాలు సంభవించే ప్రాంతం ఏది?
జ: వాయవ్య పసిఫిక్ మహాసముద్రం
8. పిచ్చివాని ప్రవర్తనను పోలి ఉండే ప్రకృతి వైపరీత్యం ఏది?
జ: చక్రవాతాలు
9. శీతల వాయువు, ఉష్ణ వాయువుల మధ్య ఉన్న సరిహద్దుకు ఏమని పేరు?
జ: వాతాగ్రం
10. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులపాటు కదలకుండా స్థిరంగా ఉండే వాతాగ్రాన్ని ఏమంటారు?
జ: స్థిర వాతాగ్రం
11. వాతాగ్రం సందర్భంగా విభిన్న రాశుల మధ్య వ్యత్యాసం ఎందులో కనిపిస్తుంది?
1) ఉష్ణోగ్రత 2) పీడనం 3) పవన వ్యవస్థ 4) అన్నీ
జ: 4 (అన్నీ)
12. తుపాను కుటుంబాలు కలిగిన చక్రవాతాలు ఏవి?
జ: సమశీతోష్ణ మండల చక్రవాతం
13. వాతావరణంలో విక్షోభాలు ఉన్నప్పుడు గర్జన మేఘాలుగా మారి, భయంకర కల్లోలానికి కారణమయ్యే మేఘాలు ఏవి?
జ: క్యుములస్
14. 'గుర్రంతోక మేఘాలు'గా వేటిని పిలుస్తారు?
జ: సిర్రస్
15. మేఘాల రాజుగా ఏ మేఘాలనుగుర్తించారు?
1) సిర్రో క్యుములస్ 2) నింబోస్ట్రాటస్ 3) క్యుములస్ 4) క్యుములోనింబస్
జ: 4 (క్యుములోనింబస్)