• facebook
  • whatsapp
  • telegram

అంతఃస్రావ వ్యవస్థ

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో అంతఃస్రావ గ్రంథులకు ఉదాహరణ కానిది?
1) పిట్యుటరీ          2) థైరాయిడ్‌            3) లాలాజల             4) అడ్రినల్‌ 

2. మన శరీరంలో మిశ్రమ గ్రంథులకు ఉదాహరణ?
1) కాలేయం, క్లోమం            2) క్లోమం, బీజకోశాలు             

 3) థైరాయిడ్, అడ్రినల్‌     4) లాలాజల, అశ్రు

3. కిందివాటిలో హార్మోన్‌ల ప్రత్యేకతలు ..
1) వీటిని రసాయన వార్తావాహకాలు అంటారు. 
2) ఇవి కొద్ది మొత్తంలో ఉన్నా ప్రభావం చూపుతాయి.
3) ఇవి నిర్ణీత కణజాలం మీద మాత్రమే ప్రభావం చూపుతాయి.
4) పైవన్నీ 

4. యుక్తవయసు తర్వాత పెద్దవారిలో పెరుగుదల హార్మోన్‌ ఎక్కువైతే కలిగే వ్యాధి? 
1) మరుగుజ్జుతనం        2) అతి దీర్ఘకాయత్వం            
 3) ఆక్రోమెగాలి             4) ఆక్రోమిక్రియా

5. పిట్యుటరీ గ్రంథి స్రవించే హార్మోన్‌లు కింది వేటిపై ప్రభావం చూపుతాయి?
1) థైరాయిడ్‌ గ్రంథి      2) అడ్రినల్‌ గ్రంథులు             
3) బీజకోశాలు               4) అన్నీ

6. ఏ హార్మోన్‌ను గామిటోకైనటిక్‌ ఫ్యాక్టర్‌ అంటారు?
1) ఫాలిక్యులార్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌        
2) ల్యుటియోట్రోపిక్‌ హార్మోన్‌             
3) ల్యుటినైజింగ్‌ హార్మోన్‌              
4) లాక్టోజెనిక్‌ హార్మోన్‌ 

7. ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ స్త్రీలలో కింది ఏ విధమైన విధులకు అవసరమవుతుంది?
1) క్షీర గ్రంథుల అభివృద్ధికి           
2) శిశుజననం తర్వాత క్షీరం ఏర్పడటానికి            
3) ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ స్రవించడం, ప్రేరేపించడం        
4) అన్నీ 

8. ఇంటర్‌స్టీషియల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ కింది ఏ హార్మోన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది?
1) టెస్టోస్టిరాన్‌         2) ఈస్ట్రోజన్‌        3) ప్రొజెస్టిరాన్‌     4) ప్రొలాక్టిన్‌ 

9. థైరాక్సిన్‌ హార్మోన్‌ లోపం వల్ల చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి?
1) జైగాంటిజమ్‌      2) క్రిటినిజమ్‌       3) గాయిటర్‌       4) ఆక్రోమెగాలి

10. మూత్రం రూపంలో బయటకు వెళ్లే నీటి పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్‌? 
1) ప్రొలాక్టిన్‌      2) థైరాక్సిన్‌     3) వాసోప్రెస్సిన్‌       4) పారాథార్మోన్‌

11. అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి? 
1) కాలేయం    2) థైరాయిడ్‌      3) పిట్యుటరీ     4) అడ్రినల్‌ 

12. పారాథార్మోన్‌ హార్మోన్‌ ఎక్కువైతే కలిగే వ్యాధి?
1) ఆస్టిస్‌ఫైబ్రోసా     2) ఎక్జాఫ్తాల్మిక్‌ గాయిటర్‌     3) మిక్సోడిమా    4) పారాథైరాయిడ్‌ టెటనీ

 

సమాధానాలు
1-3;  2-2;  3-4;  4-3;  5-4;  6-1;  7-4; 8-1;  9-2;  10-3;  11-2;  12-1.
 

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌