• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - శాస్త్ర సాంకేతిక రంగ పురోగతి

1. భారతదేశంలో కింది  ఏ గ్రంథాన్ని ప్రాచీన వైద్యశాస్త్రమైన ఆయుర్వేద ఆవిర్భావానికి గుర్తుగా పేర్కొంటారు?

1) చరక సంహిత      2) శుశ్రుత సంహిత      3) 1, 2      4) ఏదీకాదు

జ:  శుశ్రుత సంహిత

 


2. భారత ప్రాచీన శాస్త్రవేత్త ఆర్యభట్ట కింది దేన్ని కనుక్కున్నట్లు చరిత్రకారులు పేర్కొంటారు?

1) సూర్య కేంద్రక సిద్ధాంతం      2) సున్నా       3) π విలువ     4) పైవన్నీ

జ:  పైవన్నీ

 


3. హోమగుండాల నిర్మాణానికి వాడే జామెట్రీ (జ్యామితి) సూత్రాలు కింది ఏ భారత ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి? 

1) ఆర్యభట్టీయం      2) సిద్ధాంత శిరోమణి     3) సుల్వ సూత్ర     4) పంచ సిద్ధాంత 

జ:  సుల్వ సూత్ర

 


4. భాస్కర-2 కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఆయన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించారు.

బి) ఆల్జీబ్రాని కనుక్కున్నారు.

సి) త్రికోణమితి జ్యామితులను ప్రస్తావించారు

1) ఎ, బి      2) ఎ, సి           3) బి, సి     4) పైవన్నీ

జ: పైవన్నీ

 


5. సింధూ నాగరికతకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) చక్రం, నాగలిని కనుక్కున్నారు.

బి) లోహాలను కరిగించడం, వాటి నమూనాలు తయారు చేయటం వీరికి తెలుసు. 

సి) వీరు భవన నిర్మాణంలో అత్యంత నైపుణ్యాన్ని కనబరిచారు.

డి) కాల్చిన ఇటుకలను నిర్ధారిత కొలతలతో ఉపయోగించారు.

1) ఎ, సి       2) ఎ, బి     3) ఎ, బి, డి       4) పైవన్నీ

జ: పైవన్నీ

 


6. ప్రాచీన భారతదేశానికి చెందిన ఏ శాస్త్రవేత్త పరమాణు నిర్మాణం గురించి పేర్కొన్నారు?

1) కనడ్‌ (Kanada)     2) శుశ్రుత      3) చరక         4) వరాహమిహిర 

జ:  కనడ్‌ (Kanada)  

 


7. కింది ఏ గ్రంథం ఆర్యభట్ట పరిశోధనలను బలపరుస్తూ, ఆయన తర్వాతి తరంలో భారతదేశంలో ఖగోళ రంగంలో అత్యంత నిర్ధారణతో ఖగోళ అంశాలను విశదీకరించింది?

1) పంచ సిద్ధాంత      2) సూర్య సిద్ధాంత      3)1, 2       4) వజ్రలేప

జ: 1, 2

 


8. కిందివాటిలో సరైనవి?

ఎ) ప్రాచీన భారతదేశ శస్త్రచికిత్స నైపుణ్య గ్రంథం - శుశ్రుత సంహిత

బి) ప్రాచీన భారతదేశ ఆయుర్వేద చికిత్స గ్రంథం - చరక సంహిత 

సి) భారత వైద్యశాస్త్ర భాండాగారం - అధర్వణ వేద

1) ఎ, సి       2) బి, సి     3) ఎ, బి      4) పైవన్నీ

జ: పైవన్నీ

 


9. భారతదేశంలో క్రీ.శ.13, 14 శతాబ్దాల్లో పర్షియన్‌ ప్రభావంతో ఏర్పడిన వైద్య విధానం ఏది?

1) ఆయుర్వేదం      2) నేచురోపతి      3) యునాని     4) హోమియోపతి 

జ:  యునాని

 


10. ప్రాచీన భారతదేశంలో వేద నాగరికత ప్రజలకు కింది ఏ విజ్ఞానశాస్త్ర అంశాలు తెలుసు?

1) ధాన్యాన్ని పులియబెట్టటం     2) టానింగ్‌ ఆఫ్‌ లెదర్‌ (తోలును శుద్ధి చేయటం) 

3) రంగుల అద్దకం గురించిన పరిజ్ఞానం      4) పైవన్నీ 

జ:   పైవన్నీ 

 


11. కిందివాటిలో వరాహమిహిర రచించిన ఖగోళశాస్త్ర పరిజ్ఞాన గ్రంథం ఏది? (ఈయన రాజా విక్రమాదిత్య ఆస్థానంలో నవరత్నాల్లో ఒకరు. ఈయన భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తాడని, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని కనుక్కున్నారు.)

1) బృహత్‌ సంహిత       2) సుల్వసూత్ర     3) ఆర్యభట్టీయం    4) మహాభాష్యం 

జ: బృహత్‌ సంహిత

 


12. పతంజలి మహర్షికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఈయన భారతదేశంలో యోగా విద్యపై అనేక పరిశోధనలు చేశారు. యోగా వల్ల మానవుడి మానసిక స్థితి మెరుగవుతుందని పేర్కొన్నారు.

బి) యోగా విద్యకి సంబంధించిన సమాచారాన్ని ‘యోగ సూత్ర’ అనే గ్రంథంలో నిక్షిప్తం చేశారు. 

సి) పాణిని రచించిన అష్టాధ్యాయి ఆధారంగా ‘మహాభాష్యం’ అనే గ్రంథాన్ని రాశారు.

1)ఎ, బి       2) బి, సి      3) ఎ, సి      4) పైవన్నీ

జ: పైవన్నీ

 


13. ‘బ్రహ్మ స్ఫూత సిద్ధాంతిక’ గ్రంథాన్ని రచించింది ఎవరు? (ఇందులో గుణకార పద్ధతులు, రుణ సంఖ్యలు ఉన్నాయి.)

1) కనడ్‌    2) ఆర్యభట్ట     3)  బ్రహ్మ గుప్త      4) మహావీర ఆచార్య 

జ:  బ్రహ్మ గుప్త 

 


14. మధ్యయుగ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) విద్యార్థులకు గణితంలో ఎక్కువ శిక్షణను ఇచ్చేవారు. మధ్య ఆసియా, పర్షియా దేశాల నుంచి గురువులను రప్పించి మదరసాల్లోని విద్యార్థులకు అరిథ్‌మెటిక్, మెన్సురేషన్, జామెట్రీ, వ్యవసాయం, ప్రజా పరిపాలన శాస్త్రాల్లో విద్యను అందించేవారు.

బి) ప్రాచీన గ్రంథాలైన సిద్ధాంత దీపిక, లీలావతి వ్యాఖ్య, సారంగధర సంహిత మొదలైనవి ఈ కాలానికి చెందినవే.

సి) ఈ కాలంలో జైపూర్‌ మహారాజు సవాయ్‌ జై సింగ్‌ ఆధ్వర్యంలో అయిదు ఖగోళ శాస్త్ర పరిశీలన కేంద్రాలను  దిల్లీ, ఉజ్జయిని, వారణాసి, మధుర, జైపూర్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

డి) ఈ కాలంలోనే మహ్మదీయులు భారతదేశంలోకి ప్రవేశించారు. వీరి రాకతో వ్యవసాయ రంగంలో వాణిజ్య పంటల అభివృద్ధి జరగడమే కాకుండా, యునాని వైద్యం కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది.

1) ఎ, బి       2) ఎ, సి, డి      3) ఎ, బి, సి       4) పైవన్నీ

జ:  పైవన్నీ

 


15. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య విజ్ఞానం కలిగిన గ్రంథం ఏది? 

1) బృహత్‌ సంహిత      2) ఆత్రేయ సంహిత      3) మహాభాష్యం     4) సుల్వ సూత్ర 

జ: ఆత్రేయ సంహిత

 


16. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగ పరిశోధనలను కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

1)  ఈ సంస్థ 1942లో ఏర్పాటైంది. భారత ప్రభుత్వం 2022 లో దిళీఖిళిజీ80 అనే నినాదంతో దేశ అవసరాలకు తగ్గట్లు నూతన పరిశోధనలు చేయాలని తీర్మానించింది.

2) ఈ సంస్థ పరిశోధనా, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) విభాగంలో 37 జాతీయ ప్రయోగశాలలను కలిగి ఉంది.

3)ఈ సంస్థ అభివృద్ధి కార్యక్రమాలు సీఎస్‌ఐఆర్‌ - సమాచార్‌ అనే మాస పత్రికలో నెలకోసారి ప్రచురితమవుతాయి.

4) పైవన్నీ 

జ:  పైవన్నీ

 


17. పూసా బాస్మతి-1847, పూసా బాస్మతి-1885, పూసా బాస్మతి-1886 వరి వంగడాలను ఏ సంస్థ రూపొందించింది? (ఈ రకాలు బ్యాక్టీరియల్‌ లీఫ్‌ బ్లైట్, బ్లాస్ట్‌ వ్యాధిని తట్టుకుంటాయి.)

1) ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌

2) సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ ఆరోమాటిక్‌ ప్లాంట్స్‌ రిసెర్చ్‌ 

3) ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఫర్‌ సెమీ ఎరిడ్‌ ట్రాపిక్స్‌

4) ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ 

జ: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌

 


18. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగ పరిశోధన సంస్థ (ఇస్రో)కి అనుబంధంగా దేశమంతటా ఎన్ని కేంద్రాలు పనిచేస్తున్నాయి?

1) 10     2) 15     3) 17     4) 19 

జ:  19 

 


19. పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, పరిశోధన కార్యకలాపాలను నిర్వహించే ‘నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ ముఖ్య కేంద్రం ఎక్కడ ఉంది? 

1) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌      2) హైదరాబాద్, తెలంగాణ    3) కర్నాల్, హరియాణా    4) వడోదర, గుజరాత్‌ 

జ:   కర్నాల్, హరియాణా

 


20. భారతదేశాన్ని చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిపేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌ (ఐఐఎంఆర్‌) సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఈ సంస్థ ఎక్కడ ఉంది?

1) కోటా, రాజస్థాన్‌      2) హైదరాబాద్, తెలంగాణ   3) కర్నూల్, ఆంధ్రప్రదేశ్‌       4) మైసూర్, కర్ణాటక

జ:  హైదరాబాద్, తెలంగాణ

 

 


మరికొన్ని...


1. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దీని ముఖ్య కేంద్రం దిల్లీలో ఉంది.

బి) ఐసీఎంఆర్‌ భారత్‌ బయోటెక్‌ సంస్థతో కలిసి కోవ్యాక్సిన్‌ని రూపొందించింది.

సి) భారతదేశంలో బయో మెడికల్‌ రిసెర్చ్‌ రంగ పరిశోధనలు, అభివృద్ధి కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది.

1)  ఎ, సి    2)  ఎ, బి      3)  బి, సి      4) పైవన్నీ 

జ:  పైవన్నీ 

 


2. భారతదేశంలో సూపర్‌ కంప్యూటర్లను సృష్టించే ‘నేషనల్‌ సూపర్‌ కంప్యూటర్‌ మిషన్‌’ ఏ సంస్థ ఆధ్వర్యంలో పపిచేస్తుంది?

1) సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC)     2) IBM     

3) అమెజాన్‌        4) నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (NICNET)

జ: సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC) 

 


3. జాతీయ శాస్త్రీయ విజ్ఞాన విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? (శాస్త్ర సాంకేతిక రంగానికి తోడ్పాటు అందించడమే లక్ష్యంగా భారతదేశంలో ఈ విధానాన్ని రూపొందించారు.)

1) 1957    2) 1958       3) 1959        4) 1960 

జ:  1958  

 


4. భారతదేశంలో 1958లో టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్‌ - 1958 ని రూపొందించారు. దీనిలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి? 

ఎ) దేశంలో శుద్ధ, అనువర్తిత, విద్యా సంబంధ విజ్ఞానశాస్త్ర పరిశోధనలను విస్తృతం చేసేందుకు అనువైన కార్యకలాపాలను వేగవంతం చేయడం.

బి) స్త్రీ, పురుషుల్లో సృజనాత్మక నైపుణ్యాలను గుర్తించి వారిని విజ్ఞానశాస్త్ర కార్యక్రమాల్లో పూర్తి భాగస్వాములను చేయడం. 

సి) శాస్త్ర పరిశోధనలో పనిచేసే వారికి అవసరమైన మౌలిక వనరులను ఏర్పాటు చేసి, వారికి తగిన గుర్తింపును కల్పించడం. తద్వారా దేశాన్ని బలోపేతం చేయడం

1) ఎ, సి     2) బి, సి      3) ఎ, బి     4)  పైవన్నీ

జ: పైవన్నీ

 


5. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోని పౌరులందరికీ అందించడమే కాకుండా, ప్రతి పౌరుడిలో విజ్ఞానశాస్త్ర స్పృహను, స్వభావాన్ని, దృక్పథాన్ని ప్రోత్సహించాలని కింది ఏ శాస్త్ర సాంకేతిక పాలసీ సూచించింది? 

1) 1983     2) 1993     3) 2003      4) 2013

జ: 2003

Posted Date : 20-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌