• facebook
  • whatsapp
  • telegram

కాంతి - కటకాలు, దృక్‌ సాధనాలు

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో ఏ కటకాన్ని అభిసరిణి కటకం అంటారు?

1) కుంభాకార కటకం     2) పుటాకార కటకం     3) సమతల కటకం    4) ఏదీకాదు


2. కటకాలు కాంతి యొక్క ఏ ధర్మంపై ఆధారపడి పనిచేస్తాయి?

1) పరావర్తనం       2) వివర్తనం       3) వక్రీభవనం       4) ధ్రువణం


3. ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే కటకం ఏది?

1) పుటాకార కటకం      2) కుంభాకార కటకం     3) 1, 2         4) ఏదీకాదు


4. సినిమా ప్రొజెక్టర్‌ల ముందు ఉపయోగించే కటకం?

1) కుంభాకార కటకం      2) పుటాకార కటకం     3) 1, 2          4) ఏదీకాదు


5. కటకాల మధ్య బిందువును ఏమంటారు? 

1) నాభి        2) వక్రతా కేంద్రం     3) దృక్‌ కేంద్రం      4) ధ్రువం


6. కింది ఏ దృక్‌ సాధనం చిన్నదైన, నిటారు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది?

1) సరళ సూక్ష్మదర్శిని   2) ఖగోళ దూరదర్శిని   3) సంయుక్త సూక్ష్మదర్శిని   4) భూగోళ దూరదర్శిని


7. కిందివాటిలో హస్తరేఖలు చూడటానికి ఉపయోగించే దృక్‌ సాధనం?

1) భూగోళ దూరదర్శిని  2) సరళ సూక్ష్మదర్శిని      3) ఖగోళ దూరదర్శిని      4) సంయుక్త సూక్ష్మదర్శిని


8. దీర్ఘదృష్టి లోపాన్ని సవరించడానికి ఉపయోగించే కటకం?

1) సమతల కటకం     2) పుటాకార కటకం      3) కుంభాకార కటకం      4) ఏదీకాదు


9. ఫ్లాష్‌ లైట్లలో ఉపయోగించే కటకం?

1) పుటాకార కటకం      2) కుంభాకార కటకం     3) సమతల కటకం      4) ఏదీకాదు


10. నాభి, దృక్‌ కేంద్రానికి మధ్య గల దూరాన్ని ఏమంటారు?

1) వక్రతా వ్యాసార్ధం       2) ప్రతిబింబ దూరం     3) వస్తుదూరం      4) నాభ్యంతరం 

 

సమాధానాలు

1-1,  2-3,   3-1,   4-1,   5-3,  6-4,   7-2,  8-3,   9-1,   10-4.


రచయిత: వడ్డెబోయిన సురేష్‌

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌