• facebook
  • whatsapp
  • telegram

కిరణజన్య సంయోగక్రియ

మాదిరి ప్రశ్నలు

1. కిరణజన్య సంయోగక్రియలో ఏ పదార్థాలు ఉపయోగపడతాయి?

1) ఆక్సిజన్, నీరు     2) నీరు, కార్బన్‌ డై ఆక్సైడ్‌

3) కాంతి, పత్రహరితం   4) గాలి, గ్లూకోజ్‌

 

2. కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్‌ కిందివాటిలో ఏది విచ్ఛిన్నమవడం వల్ల ఏర్పడుతుంది?

1) గ్లూకోజ్‌     2) కార్బన్‌ డై ఆక్సైడ్‌   3) నీరు     4) కాంతి

 

3. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా నేరుగా ఏర్పడే ఆహార పదార్థం-

1) గ్లూకోజ్‌    2) పిండిపదార్థం    3) పాలిశాకరైడ్‌    4) సెల్యులోజ్‌

 

4. కిరణజన్య సంయోగక్రియలో కాంతిశక్తి ఏ విధంగా మారుతుంది?

1) గతిశక్తి     2) స్థితిశక్తి    3) ఉష్ణశక్తి     4) రసాయనశక్తి 

 

5. పక్వానికి వచ్చిన టమాట రంగుకు కారణమైన వర్ణద్రవ్యం ఏది?

1) క్లోరోఫిల్‌     2) లైకోపిన్‌     3) మెలనిన్‌     4) ఫైకోసయనిన్‌

 

6. కింది ఏ కణాంగాన్ని ఆహార పదార్థాల ఉత్పాదక కేంద్రం అని పిలుస్తారు?

1) గాల్జి సంక్లిష్టం    2) మైటోకాండ్రియా     3) హరితరేణువు    4) రిక్తిక

 

7. కిరణజన్య సంయోగక్రియ వల్ల జీవులు, మానవాళికి కలిగే ఉపయోగం?

1) అన్ని జీవులకు ఆహారం లభిస్తుంది.  

 2) వాతావరణంలోని ఆక్సిజన్‌కు మూలం.

3) కర్బన స్థాపన జరిగి గ్రీన్‌హౌస్‌ ప్రభావం తగ్గుతుంది.      

4) పైవన్నీ 

 

8. మొక్కల్లో బాష్పోత్సేకం ఎక్కువగా ఏ భాగాల నుంచి జరుగుతుంది?

1) పత్రాలు     2) ఫలాలు     3) వేర్లు     4) కాండం

 

9. పత్రాల్లోని పత్రరంధ్రాలు తెరుచుకోవడం, మూసుకోవడానికి సహాయపడేవి?

1) బాహ్యచర్మ కణాలు          2) రక్షక కణాలు

3) అనుబంధ కణాలు           4) జ్వాలా కణాలు

 

10. కిందివాటిలో ఏ కారకం ఎక్కువైతే మొక్కల్లో బాష్పోత్సేకం పెరుగుతుంది?

1) గాలివేగం       2) కాంతి       3) వాతావరణంలో ఆక్సిజన్‌        4) ఏదీకాదు 

 

11. మొక్కల్లో జరిగే ఏ ప్రక్రియను ‘తప్పనిసరైన చెడు’ అంటారు?

1) ప్రొటీన్ల సంశ్లేషణ    2) కిరణజన్య సంయోగక్రియ

3) శ్వాసక్రియ          4) బాష్పోత్సేకం

 

12. మొక్కల్లోని ఏ ఫైటోహార్మోన్లు బాష్పోత్సేక నిరోధకంగా పనిచేస్తాయి?

1) ఆక్సిన్‌లు    2) జిబ్బరెల్లిన్‌లు    3) అబ్‌సిసిక్‌ ఆమ్లం  4) ఇథిలీన్‌

 

సమాధానాలు  

1-2;   2-3;  3-1;   4-4;   5-2;   6-3;   7-4;   8-1;   9-2;   10-2;   11-4;   12-3.

Posted Date : 09-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌